Site icon Prime9

Ycp MP Magunta Son Arrest : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు అరెస్ట్‌..

ycp mp magunta son arrest in delhi liquor scam

ycp mp magunta son arrest in delhi liquor scam

 Ycp MP Magunta Son Arrest : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ బాగోతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

ఈ లిక్కర్ స్కామ్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో భాగంగా తాజాగా ఈడీ అధికారుల మరొకరిని అరెస్ట్ చేశారు.

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ స్కామ్‌లో భాగంగా.. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు విజయ్ నాయర్ ఖాతాలోకి వెళ్లాయని, ఆయన ఆ డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందజేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. ఆ సంస్థలో ఉన్న శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌తో ఈడీ పేర్కొంది. బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు. గత 70 ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. దేశ వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 నియమాలు ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా ఉంది. అయితే పిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట ఆగ్రో ఫాష్ ప్రైవేట్ లిమిటెడ్లకు పరిమితులకు మించి కేటాయించారని సమాచారం అందుతుంది. దాంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో ఇప్పటికే సుమారు 9 మంది ఈ కేసులో అరెస్ట్‌ కాగా .. ఈ కేసులో ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన గౌతమ్ మల్హోత్రా ఢిల్లీలో ఉన్న బ్రికాంక్ కో అనే సేల్స్ ఆర్గనైజేషన్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఢిల్లీ ఆప్ నేతలతో మల్హోత్రాకు పరిచయాలు ఉన్నాయని, వారి అండతోనే ఈ లిక్కర్ బిజినెస్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంపాదించిన డబ్బులను.. గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం అతడు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చిన ఈడీ (Ycp MP Magunta Son Arrest)..

ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే.. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పలు సందర్భాల్లో మాగుంట శ్రీనివాసులు వెల్లడించారు. రాఘవను ఈడీ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు. రాఘవ అరెస్ట్‌తో ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఫోన్ ట్యాపింగ్ లు మరోపక్క ఎంపీ కుమారుడు అరెస్ట్ తో వైసీపీ ఉలిక్కిపడిందనే చెప్పాలి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version