Wrestling Federation of India: ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ( యుడబ్ల్యుడబ్ల్యు) రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యుఎఫ్ఐ) సభ్యత్వాన్ని నిరవధికంగా నిలిపివేసింది. డబ్ల్యుఎఫ్‌ఐ వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీనివల్ల దాని ఎన్నికలు గణనీయంగా వాయిదా పడ్డాయి.
భారతదేశం యొక్క రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన ఫెడరేషన్ జూన్ 2023లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ, భారతీయ రెజ్లర్ల వరుస నిరసనలు మరియు వివిధ రాష్ట్ర విభాగాల నుండి న్యాయపరమైన పిటిషన్‌ల కారణంగా ఎన్నికలు పదేపదే వాయిదా పడ్డాయి. దీనివలన భారత జెండా కింద రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారతీయ రెజ్లర్లను పోటీ చేయడానికి అనుమతించరు.భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక ప్యానెల్ ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువును గౌరవించనందున సెప్టెంబర్ 16 నుండి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ‘తటస్థ క్రీడాకారులు’గా పోటీ పడవలసి ఉంటుంది. అయితే, రెజ్లర్లు సెప్టెంబర్ 23న హాంగ్‌జౌలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో భారత జెండా కింద పోటీపడవచ్చు. ఎందుకంటే ఈ పోటీలకు ఎంట్రీలను డబ్ల్యుఎఫ్ఐ కాకుండా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పంపింది.
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్‌తో సహా నలుగురు అభ్యర్థులు సోమవారం పాలకమండలి అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర స్థానాల్లో ఉత్తరాఖండ్ ఎస్పీ దేశ్వాల్ కోశాధికారి పదవికి నామినేట్ కాగా, ప్రధాన కార్యదర్శిగా దర్శన్ లాల్ (చండీగఢ్ రెజ్లింగ్ బాడీ నుంచి) పేరు వచ్చింది. డబ్ల్యుఎఫ్‌ఐ సస్పెన్షన్ విషయానికి వస్తే, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌పై చర్య తీసుకోవడం 2023లో ఇది మూడోసారి. అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ దేశంలోని రెజ్లర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో మొదట జనవరిలో, ఆపై మేలో డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెండ్ చేయబడింది. డబ్ల్యుఎఫ్ఐ లో రోజువారీ వ్యవహారం ప్రస్తుతం భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్-ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీ ద్వారా నిర్వహించబడుతోంది.