Wrestlers Protest: భారతీయ రెజ్లింగ్‌లో కొనసాగుతున్న సంక్షోభం తాజా మలుపు తిరిగింది.తమ కెరీర్‌లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయినందుకు నిరసనగా వందలాది మంది జూనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. ఈ పరిస్థితికి వారు అగ్రశ్రేణి గ్రాప్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ లను నిందించారు.
ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి జూనియర్ రెజ్లర్లు బస్సుల్లో వచ్చారు. వీరిలో దాదాపు 300 మంది ఛప్రౌలీ, బాగ్‌పట్‌లోని ఆర్యసమాజ్ అఖారా నుండి వచ్చారు, ఇంకా చాలా మంది నరేలాలోని వీరేందర్ రెజ్లింగ్ అకాడమీ నుండి వచ్చారు. చాలా మంది ఇప్పటికీ బస్సుల్లోఉన్నారు. వారు భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసేందుకు నానా తంటాలు పడ్డారు.’UWW ఈ ముగ్గురు రెజ్లర్ల నుండి మా కుస్తీని కాపాడండి’ అని రాసి ఉన్న బ్యానర్లను పట్టుకుని నినాదాలు చేసారు.
సుమారుగా ఏడాది కిందట ఇదే ప్రదేశంలో, మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధిస్తున్నాడని డబ్ల్యుఎఫ్ఐ (భారత రెజ్లింగ్ సమాఖ్య) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు రెజ్లర్లు పిలుపునిచ్చారు.రైతు సంఘాలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు మరియు రెజ్లింగ్ సోదరుల సభ్యులతో సహా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియాలకు మద్దతుగా నిలిచారు.అదే రెజ్లర్లు ఇపుడు అదే ప్రదేశంలో తమ రెజ్లర్ల నుంచి నిరసనలను ఎదుర్కొంటున్నారు. కెరీర్ ను నాశనం చేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జనవరి 2023 నుండి డబ్ల్యుఎఫ్ఐ రెండుసార్లు సస్పెండ్ చేయబడింది. ఒక తాత్కాలిక ప్యానెల్ క్రీడను నడుపుతున్నందున జాతీయ శిబిరాలు మరియు పోటీలు నిలిపివేయబడ్డాయి.క్రీడా మంత్రిత్వ శాఖ తాత్కాలిక ప్యానెల్‌ను రద్దు చేసి సస్పెండ్ చేసిన డబ్ల్యుఎఫ్‌ఐని పునరుద్ధరించాలని బుధవారం రెజ్లర్లు డిమాండ్ చేసారు.