Wrestlers Protest: లైంగిక ఆరోపణల నివేదికపై భారత రెజ్లర్లు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండో కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రంతా దీక్షా శిబిరంలోనే ఉన్న వారు.. సోమవారం ఉదయం దానిని కొనసాగిస్తున్నారు. అయితే సోమవారం రెజ్లర్లు రూటు మార్చారు. గతంలో రాజకీయ నాయకుల అవసరం లేదన్న వీరు.. తాజాగా ఈసారి రాజకీయ పార్టీల మద్దతు కోరారు.
రాజకీయ పార్టీల మద్దతు.. (Wrestlers Protest)
లైంగిక ఆరోపణల నివేదికపై భారత రెజ్లర్లు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండో కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రంతా దీక్షా శిబిరంలోనే ఉన్న వారు.. సోమవారం ఉదయం దానిని కొనసాగిస్తున్నారు. అయితే సోమవారం రెజ్లర్లు రూటు మార్చారు. గతంలో రాజకీయ నాయకుల అవసరం లేదన్న వీరు.. తాజాగా ఈసారి రాజకీయ పార్టీల మద్దతు కోరారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై వీరు ధర్నా చేస్తున్నారు. వేధింపుల ఆరోపణలపై కమిటీ నివేదిక అందించిన కూడా.. కేంద్రం బహిర్గతం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో మెుదటిసారి ఆందోళన చేసినపుడు.. రాజకీయ పార్టీల మద్దతు అవసరం లేదన్నారు.
ఈసారి తాము అలా చేయమని.. బజరంగ్ పునియా తెలిపాడు. తమ ఆందోళనకు మద్దతిచ్చేవారు ఎవరైనా తమతో పాటు ధర్నాలో కూర్చోవచ్చని తెలిపాడు.
తమ నిరసనకు ఈసారి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భాజపా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ.. ఏ పార్టీ అయినా సరే మాకు మద్దతిచ్చి దీక్షలో కూర్చోవచ్చని ప్రకటించారు.
కానీ ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని వివరించారు.
దర్యాప్తు చేపట్టిన దిల్లీ పోలీసులు..
బ్రిజ్ భూషణ్ పై ఓ మైనర్ సహా ఏడుగురు బాలికలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
లైంగిక ఆరోపణలపై దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఏప్రిల్ మెుదటి వారంలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఈ దర్యాప్తు నివేదికను ఇప్పటి వరకు కేంద్రం బహిర్గతం చేయలేదు.
వెంటనే ఈ నివేదికను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.
కమిటీ నివేదిక కోసం.. 3 నెలలుగా ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాలని వారు ఆందోళన చేపట్టారు.
బ్రిజ్‌భూషణ్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.
పారిస్ ఒలింపిక్స్ కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో.. సరైన శ్రద్ధతో సన్నాహాలు ప్రారంభించాలని కోరుతున్నట్లు వినేశ్ పొగాట్ తెలిపింది.
మెుదటి సారి చేసిన ధర్నాలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలవడం తన నైతిక బాధ్యత అని బజ్‌రంగ్ తెలిపాడు. అమ్మాయిల ఆశయ సాధన కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా అందుకు సిద్ధమే అని అతనన్నాడు.