Woman judge: ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, తాను చనిపోవడానికి అనుమతించాలంటూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదికను కోరారు.
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో పోస్ట్ చేసిన మహిళా సివిల్ జడ్జి చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పరిణామం జరిగింది. తన సీనియర్ జిల్లా జడ్జి తన పట్ల చాలా అగౌరవంగా ప్రవర్తించినందుకు తాను తీవ్రంగా బాధపడ్డానని, అనాయాస మరణం కోసం మహిళా జడ్జి తన లేఖలో విజ్ఞప్తి చేశారు. జిల్లా జడ్జి మరియు అతని సహచరులు నన్ను లైంగికంగా వేధించారు. రాత్రి పూట జిల్లా జడ్జిని కలవమని నాకు చెప్పారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.తాను ఫిర్యాదు చేసినా అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి కూడా ఫిర్యాదు చేసాను. అయితే ప్రతిపాదిత విచారణ కూడా ఒక ప్రహసన మరియు బూటకం అని ఆమె అన్నారు. ఆడవాళ్ళందరికీ బొమ్మగా లేదా జీవం లేని వస్తువుగా ఉండడం నేర్చుకోవాలని నేను సలహా ఇస్తున్నాను. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి నన్ను అనుమతించండి అంటూ ఆమె తన లేఖలో కోరారు.
దీనిపై సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను పూర్తి నివేదికను ఇవ్వాలంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. కుర్హేకర్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు మహిళా న్యాయమూర్తి చేసిన అన్ని ఫిర్యాదుల గురించి సమాచారం కోరుతూ లేఖ రాశారు.