Site icon Prime9

YouTube Tutorial: యూట్యూబ్‌లో చూసి భార్యకు డెలివరీ చేయాలని చూసాడు.. ప్రయత్నం వికటించి మృతిచెందిన భార్య

YouTube Tutorial

YouTube Tutorial

YouTube Tutorial: తమిళనాడులోని కృష్ణగిరిలో 27 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. ఆమె భర్త ఇంట్లో సహజ ప్రసవానికి ప్రయత్నించాడు, అతను యూట్యూబ్‌లో నేర్చుకున్న టెక్నిక్‌ని ఉపయోగించి ప్రసవం చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు.

బొడ్డు తాడు సరిగా కోయకపోవడంతో..(YouTube Tutorial)

పోచంపల్లి సమీపంలోని పులియంపట్టికి చెందిన లోగనాయకి మృతిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి రాధిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం, లోగనాయకి భర్త మాధేష్ ఆమెకు ఇంట్లోనే ప్రసవం చేయాలని నిర్ణయించాడు. ప్రసవ సమయంలో బొడ్డు తాడు సరిగా కోయకపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు తెలిసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పిహెచ్‌సికి తీసుకురాగా, అక్కడికి చేరుకునేలోపే చనిపోయిందని నిర్ధారించారు. అనంతరం పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version
Skip to toolbar