Site icon Prime9

Wipro: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం

Wipro

Wipro

Wipro: ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతలు విధిన్నాయి. ఈ తరుణంలో విప్రో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది.

2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన వేరియబుల్ పే ను అందనుంది. మూడో క్వార్టర్ లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేస్తున్నట్టు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియ జేశారు.

ఫ్రెషర్స్ కు కూడా(Wipro)

ఇక ఉద్యోగులందరికీ అంటే A నుంచి B3 లెవెల్ ఉద్యోగులు, అన్ని సపోర్ట్ ఫంక్షన్స్‌లో పనిచేసే సిబ్బందికి కంపెనీ పెర్ఫామెన్స్ ఆధారంగా 87 శాతం వేరియబుల్ పే చెల్లించనుండగా.. మరోవైపు మేనేజర్ స్థాయి, అంతకుమించి లెవెల్ ఉద్యోగులకు.. బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ ఆధారిత వేరియబుల్ పే చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది.

వేరియబుల్ పే అందుకునే వారిలో ఫ్రెషర్స్ కూడా ఉండటం గమనార్హం.

ఇక ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో విప్రో కాస్త నిరాశపరిచిన విషయం తెలిసిందే. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే రెవెన్యూ కేవలం 0.6 శాతం పెరిగింది.

బుకింగ్స్ మాత్రం 23.7 శాతం పెరగడం గమనార్హం. ఇక ఆపరేటింగ్ మార్జిన్ 16.3 శాతం పెరుగుదల నమోదు చేసింది.

కంపెనీ అనుకున్న లక్ష్యాలను మాత్రం సాధించలేకపోయిందని గోవిల్ తెలిపారు. ఇటీవల త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఏకీకృత ఆదాయన 14.3 శాతం పెరిగి రూ. 23,229 కోట్లకు చేరుతుంది.

ఫిబ్రవరి జీతంతో విడుదల

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే ను ఉద్యోగుల ఫిబ్రవరి నెల జీతంతో విడుదల చేయనుంది విప్రో.

భవిష్యత్ లో కంపెనీ మంచి పనితీరు కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. గత త్రైమాసికంలో 100 శాతం వేరియబుల్ పే ను విప్రో ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత మూడు నెలలుగా ఐటీ కంపెనీల పనితీరు అంత అంత మాత్రంగా ఉంటోంది. ఒక పక్క ద్రవ్యోల్బణం పెరగడం..

మరో పక్క ఆర్థిక మాంద్యం ముప్పు తో ఉద్యోగాలకు భారీగా కోతలు పడుతున్నాయి. ఉద్యోగాన్ని కాపాడుకోవడమే చాలా కష్టంగా మారింది.

దిగ్గజ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా లు కూడా ఉద్యోగులను తొలగించాయి.

అయితే ఈ సమయంలోనూ విప్రో వేరియబుల్ పే 87 శాతం ప్రకటించడం ఉద్యోగుల్లో సంతోషం కలిగించే విషయం.

Exit mobile version