Site icon Prime9

Tamilnadu: ‘అమ్మ తోడు కోసం’.. ఇద్దరు కుమారులు ఏం చేశారంటే?

tamilnadu

tamilnadu

Tamilnadu: పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరిని కష్టపడి చదివించింది. పెరిగి పెద్దయ్యాక వారికి పెళ్లి చేయాలనుకుంది. కానీ ఆ కుమారులే తమ తల్లికి రెండో పెళ్లి చేయాలని నిశ్ఛయించారు. ఈ విషయం విన్న తల్లి.. చాలా ఆశ్చర్యపోయారు.

తల్లికి తోడుగా రెండో పెళ్లి.. (Tamilnadu)

అది తమిళనాడు.. కల్లకురిచి జిల్లా.. వలయంపట్టు గ్రామం ఆమె పేరు సెల్వి.. ఆమెకు ఇద్దరు కొడుకులు. 2009 లో భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఎంతోకాలంగా మీ అమ్మ ఒంటరి జీవితం గడుపుతోంది, రెండో పెళ్లి మీరే ఎందుకు చేయకూడదని ఆ ఇద్దరు కుమారలను అడిగారు. అక్కడతో ఈ రెండో వివాహ ఆలోచన ప్రారంభమైంది. ఇదే ఆలోచనతో పెద్ద కుమారుడు భాస్కర్.. తన తల్లిని ప్రశ్నించాడు. నువ్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదని. ఈ మాటలు విని తల్లి ఆశ్చర్యపోయింది.

కానీ ఈ నిర్ణయాన్ని సమాజం హర్షిస్తుందా..? ఏమో, ఓసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.. తమ్ముడికి ఇదే విషయం చెప్పాడు. అన్న చెప్పిందాంట్లో అభ్యంతరకరం ఏమీ లేదు కదా, మనమే చేసేద్దాం అని తమ్ముడు సపోర్ట్ చేశాడు. కానీ ఆమె ఈ రెండో పెళ్లికి అంగీకరిస్తుందా..? అడిగి చూద్దాం అనుకుని తల్లి ఎదుట ఈ ప్రతిపాదన పెట్టారు. నువ్వ రెండో పెళ్లి చేసుకుంటేనే నేను చేసుకుంటాను అని పెద్ద కొడుకు మెలిక పెట్టాడు.

మెుదట ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించని సెల్వి.. ఆ తర్వాత ఆలోచనల్లో పడింది. నేను భర్తలను కోల్పోయిన మరికొంతమందికి ఎందుకు ఉదాహరణగా నిలవొద్దు అనుకుంది. దీంతో రెండో పెళ్లికి ఒప్పుకుంది. భర్తలను కోల్పోయిన చాలా మంది ఒంటరిగానే బతుకుతున్నారు. దీంతో చాలా మంది బంధువులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ తన జీవితాన్ని నిర్ణయించుకునే ధైర్యాన్ని, తెగువను తన కొడుకులు తనకు అందించారని సెల్వి అన్నారు.

వరుడి కోసం వెతుకులాట..

రెండో పెళ్లికి తల్లి అంగీకరించడంతో.. వరుడిని వెతకడం ప్రారంభించారు. వరుడిని వెతకటం అంత ఈజీగా ఏమి కాదని.. దాని కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని భాస్కర్ అన్నారు.

దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. పిల్లలకు భారం కాకుండా చివరి రోజుల్లో తన కోసం ఒక జీవిత భాగస్వామిని వెతుక్కోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.

పెళ్లి అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదని.. ఒక స్నేహితుడిలా మీ వెంట ఒకళ్లు ఉండేవాళ్లని అన్నారు.

భర్తను కోల్పోయిన సమయంలో.. చాలా మంది తప్పుడు ఉద్దేశంతోనే తన వద్దకు వచ్చేవారని సెల్వి అన్నారు.

పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కాకుండా.. అవసరం కోసం వచ్చేవారని తెలిపింది. భర్త లేకుండా ఒంటరిగా బతుకుతుండటంతో చాలా మంది తనతో లైంగిక సంబంధం పెట్టుకునేలా మాట్లాడేవారని అన్నారు.

నా లాగా భర్తలను కోల్పోయిన ఆడవాళ్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని సెల్వి అన్నారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఆమె పంచుకున్నారు.

మహిళల జీవితాలకు కూడా ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని, తమ చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందోనని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని పొందాలని ఆశించారు.

సెల్వి పునఃవివాహానికి ఆమె కుటుంబానికి చెందిన ఎవరూ హాజరుకాలేదు. ఆమె పెళ్లి చేసుకున్న వరుడు తరఫు వాళ్లు కొందరు ఈ పెళ్లికి వచ్చారు.

భర్త లేని సమయంలో కుటుంబ సభ్యులు ఎవరు తనకు అండగా నిలవలేదని సెల్వి అన్నారు. దీంతోఒంటరిగానే పిల్లల్ని పెంచాను.

ఆ సమయంలో, నా కొడుకులు కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేశారు. ఆ పరిస్థితులను అర్థం చేసుకున్నారు అని సెల్వి తెలిపారు.

ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ పెరిగిన తన కొడుకులు, సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

ప్రస్తుతం సెల్వి యేలుమలై అనే ఒక రైతు కూలీని పెళ్లి చేసుకున్నారు.

Exit mobile version