Amit Shah in Bihar: అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతీయ జనతాపార్టీ సీతమ్మకు దేవాలయం కట్టి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం లోకసభ ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. ఐదవ విడత ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఓ పెద్ద హామీ గుప్పించారు. అదేమిటంటే బీజేపీ అధికారంలోకి వస్తే బిహార్‌లో సీత దేవి అతి పెద్ద దేవాలయం నిర్మిస్తామని ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడం..(Amit Shah in Bihar)
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి రాని వారు సీతాదేవి దేవాలయం ఎలాను కట్టారు. ఇక సీతా మా కోసం దేవాలయం కట్టే సత్తా కేవలం నరేంద్రమోదీ మాత్రమే ఉందని అమిత్ షా అన్నారు. గురువారం నాడు ఆయన బిహార్‌లోని సీతామార్హిలో సీతా మా అతి పెద్ద దేవాలయం నిర్మిస్తామన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిపారు. ఇప్పుడు మా సీత జన్మించిన బిహార్‌లో సీతామార్హిలో పెద్ద దేవాలయం నిర్మిస్తామన్నారు.
లోకసభ ప్రచారానికి వచ్చిన అమిత్ షా పనిలోపనిగా రాష్ర్టీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై ధ్వజమెత్తారు. లాలు ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామి. ఈ రోజు ఆయన పవర్ పాలిటిక్స్ నడుపుతున్నారు. ఆయన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలనేది ఆయన జీవిత లక్ష్యం. దాని కోసం ఆయన వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చున్నారు. ఆయన జీవితాంతం వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆర్‌జేడీలు బిహార్ మాజీ సీఎం కర్పూరీ థాకూర్‌కు భారత రత్న ఇవ్వాలనే ఆలోచనరాలేదన్నారు. కర్పూరీ థాకూర్‌కు మోదీ ప్రభుత్వం భారత రత్న అవార్డు ఇచ్చి గౌవరించిందన్నారు. బిహార్‌కు కావాల్సింది వికాస్‌రాజ్.. జంగిల్‌రాజ్ కాదన్నారు అమిత్ షా. ఇదిలా ఉండగా మే 20న బిహార్‌లో ఐదవ విడతలో 40 లోకసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది.