Site icon Prime9

Customs: 27కోట్ల విలువైన వాచ్…ఎక్కడ పట్టుబడింది అంటే?

Watch worth 27 crores...where was it caught?

Watch worth 27 crores...where was it caught?

Delhi Airport: అదేం పిచ్చో..విలువైన వస్తువుల కోట్లు పెట్టి కొంటుంటారు. దర్జాగా ధరించేస్తుంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకానికి మాత్రం పంగనామాలు పెడుతుంటారు. ఈ తరహాలో కోట్ల రూపాయలు విలువైన వస్తువులను అక్రమంగా తరలిస్తూ మన కస్టమ్స్ అధికారులకు చిక్కాడు ఓ ప్రయాణీకుడు. ఇంకేముంది తీరా చూస్తే అందులో ఓ వస్తువు ఖరీదే దాదాపుగా రూ. 27కోట్లుగా ఉండడంతో అవాక్కవడం అధికారుల వంతైంది.

వివరాల మేరకు, దుబాయ్ నుండి ప్రయాణించిన ఓ వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయంలో దిగాడు. తనిఖీలు చేస్తున్న కస్టమ్స్ అధికారులకు అనుమానంగా కొన్ని వాచీలు కనపడ్డాయి. దీంతో పరిశీలించిన అధికారుల దిమ్మ తిరిగి పోయింది. అక్రమంగా తీసుకొచ్చిన 7 వాచీల్లో ఓ వజ్రాలు పొదిగి రోలెక్స్ కంపెనీకి చెందిన వైట్ గోల్డ్ వాచ్ ఖరీదు రూ. 27కోట్లుగా గుర్తించారు. వీటితో పాటు వజ్రాలు పొదిగిన బ్రాస్ లైట్, ఐఫోన్ వస్తువులను కూడా సీజ్ చేశారు.

ఇతర సుంకాలు చెల్లించకుండా స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అమెరికా జువెలరీ, వాచ్ తయారీ సంస్ధ జాకల్ అండ్ కో వారు వాచ్ ను తయారుచేసిన్నట్లు విచారణలో తేలింది. అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ మొత్తం విలువ రూ. 29కోట్ల దాకా ఉండచ్చని భావిస్తున్నారు. 60కిలోల బంగారంతో సమానమైన వస్తువులను ఈ స్థాయిలో పట్టుకోవడం ఇదే ప్రధమంగా అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mobile Phones: మొబైల్ ఫోన్ల ఛోరీ కేసును ఛేదించిన పోలీసులు.

Exit mobile version