Vikram Lander: చందమామపై మరోసారి ల్యాండయిన విక్రమ్ ల్యాండర్

ఇస్రో చంద్రయాన్ త్రీ ప్రయోగం మరో మైలురాయిని చేరింది. ఇస్రో స్టేషన్‌నుంచి అందిన ఆదేశాలతో విక్రమ్ ల్యాండర్ చందమామపై మరోసారి ల్యాండైంది. మిషన్ లక్ష్యాలని అధిగమించి ల్యాండర్ పని చేస్తోందని ఇస్రో ట్వీట్ చేసింది.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 02:53 PM IST

Vikram Lander: ఇస్రో చంద్రయాన్ త్రీ ప్రయోగం మరో మైలురాయిని చేరింది. ఇస్రో స్టేషన్‌నుంచి అందిన ఆదేశాలతో విక్రమ్ ల్యాండర్ చందమామపై మరోసారి ల్యాండైంది. మిషన్ లక్ష్యాలని అధిగమించి ల్యాండర్ పని చేస్తోందని ఇస్రో ట్వీట్ చేసింది.

భవిష్యత్ ప్రయోగాలకి ఊతం..(Vikram Lander)

భూమినుంచి అందిన ఆదేశాలతో ఇంజిన్లని జ్వలింప చేసుకుని 40 సెంటీమీటర్ల ఎత్తుకి ఎగిరిన విక్రమ్ ల్యాండర్ 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని ఇస్రో వివరించింది. ఇది భవిష్యత్ ప్రయోగాలకి మరింత ఊతమిస్తుందని ఇస్రో చెబుతోంది.ఈ పరిణామం భవిష్యత్తులో మానవ సహిత మిషన్ ప్రయోగాలకి పనికి వస్తుందని ఇస్రో వివరించింది. మిషన్‌లోని అన్ని వ్యవస్థలు సాధారణంగా, సంతృప్తికరంగా పని చేస్తున్నాయని ఇస్రో తెలిపింది. ల్యాండర్ ర్యాంప్, చంద్రుడి సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పరిమెంట్, ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సిస్మిక్ యాక్టివిటీ పరికరాలు మళ్ళీ యథాతథ స్థితికి చేరాయని ఇస్రో వెల్లడించింది.