HD Revanna: ఈ వీడియోలు నాలుగేళ్లకిందటివి.. అంతా రాజకీయ కుట్ర. ఎంపీ ప్రజ్వల్ తండ్రి రేవన్న

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవన్న సెక్స్‌ కుంభకోణం గురించి యావత్‌ దేశం చర్చించుకుంటోంది. లోకసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజ్వల్‌ శనివారం ఉదయం ఫ్రాంక్‌ఫర్ట్‌వెళ్లి పోయారు. ఆదివారం నాడు ప్రజ్వల్‌ కు చెందిన సుమారు 3వేల వీడియోలు కర్ణాటకలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌డీ రేవన్న మాత్రం తన కుమారుడిని వెనకేసుకు వస్తున్నారు

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 06:37 PM IST

HD Revanna: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవన్న సెక్స్‌ కుంభకోణం గురించి యావత్‌ దేశం చర్చించుకుంటోంది. లోకసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజ్వల్‌ శనివారం ఉదయం ఫ్రాంక్‌ఫర్ట్‌వెళ్లి పోయారు. ఆదివారం నాడు ప్రజ్వల్‌ కు చెందిన సుమారు 3వేల వీడియోలు కర్ణాటకలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌డీ రేవన్న మాత్రం తన కుమారుడిని వెనకేసుకు వస్తున్నారు. కావాలని కుట్ర పూరితంగా తన కుమారుడికి ఇరికించారని ఆయన తన ప్రత్యర్థులపై మండిపడ్డారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న వీడియోలు ఎప్పుడో నాలుగు –ఐదేళ్ల క్రితంనాటివి అని అన్నారు. తాజాగా రెవన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఓ మహిళ ప్రజ్వల్‌ రేవన్నతో పాటు ఆయన తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్‌ రేవన్న విషయానికి వస్తే జనతాదళ్‌ సెక్యూలర్‌ ఎంపీగా కొనసాగుతున్నాడు. దీంతో పాటు ఆయన తాత మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ. అయితే తాజాగా ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను ఆయన తండ్రి హెచ్‌డీ రేవన్న ఖండిస్తున్నారు. తను కుమారుడిపై అసభ్యకరమైన వీడియోలు సర్క్యులేట్‌ చేసున్న వారిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలు అంతా మార్ఫింగ్‌ చేసివన్నారు.

తాటాకు చప్పుళ్లకు భయపడను..(HD Revanna)

దీని వెనుక జరుగుతున్న కుట్ర గురించి తనకు బాగా తెలుసునని హెచ్‌డీ రేవన్న అన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడి పారిపోనన్నారు. తన ప్రత్యర్థులు విడుదల చేసిన వీడియోలు ఎప్పటివో నాలుగైదేళ్ల క్రితం నాటివి. తనపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని తెలిసింది. ఇదంతా రాజకీయ కుట్ర. దీని గురించి తానుఎలాంటి కామెంట్‌ చేయను. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. వారు ఏమీ చేయాలనుకుంటే అది చేసుకోవచ్చునని రేవన్న అన్నారు. ఇవన్నీ రాత్రికి రాత్రి వచ్చిన ఆరోపణలు కావు. గత 40 ఏళ్ల నుంచి దేవేగౌడ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా చేసుకుందన్నారు. గత 40 ఏళ్ల నుంచి ఇలాంటి కేసులను ఎదుర్కొంటూనే ఉన్నాం. దీనిపై తాను స్పందించదలచుకోలేదన్నారు. చట్ట ప్రకారం వారు ఏం చేయాలనుకున్నారో అది చేయనీయండి అన్నారు. ఇప్పటి వరకు తాను దేవేగౌడతో ఈ అంశం గురించి మాట్లాడలేదన్నారు రేవన్న. ప్రస్తుతం రేవన్నతో పాటు ఆయన కుమారుడు ప్రజ్వల్‌ రేవన్నపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. సోషల్‌ మీడియాలో సుమారు మూడు వేలవీడిమలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.