Viagra: వయగ్రా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహిళతో సమయం గడిపేందుకు ఓ వ్యక్తి రెండు వయగ్రాలు వేసుకున్నాడు. కానీ చివరకి ఆ వ్యక్తి ప్రాణమే పోయింది. ఆల్కహాల్ తో కలిపి మాత్రలు వేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మద్యం తాగాక.. వయగ్రా (Viagra)
మహిళతో గడిపేందుకు వయగ్రా వేసుకున్న ఓ వ్యక్తి ప్రాణం పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. ఇటీవలే ఓ 41 ఏళ్ల వ్యక్తికి హోటల్ లో మహిళ పరిచయమైంది. ఆ మహిళతో శారీరక సంబంధం కూడా ఏర్పడటంతో.. ఆమెతో గడిపేందుకు ఆ వ్యక్తి రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. మహిళతో గడిపే సమయంలో.. మద్యం తాగుతూ మరి వయగ్రా మాత్రలు వేసుకున్నాడు. ఆ మరుసటి రోజు.. అతడికి వాంతులు, నీరసం వంటి లక్షణాలు ఎక్కువయ్యాయి. ఇది గమనించిన మహిళ అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. కానీ తనకేమి కాలేదని.. అలా అవ్వడం మాములేనని ఆ మహిలకు చెప్పాడు. దీంతో ఆమె కూడా పట్టించుకోలేదు. కాసేపటికే ఆ వ్యక్తి పరిస్థితి విషమించింది. వెంటనే స్పందించిన మహిళ.. హోటల్ సిబ్బంది సహకారంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడికి అంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు.
మరణానికి కారణం అదే..
ఆ వ్యక్తి మరణానికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తి మరణానికి సెరిబ్రో వాస్క్యులర్ హెమరేజ్ కారణం అని వైద్యులు తేల్చారు. అంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం. దీంతోపాటు రక్తం గడ్డకట్టడం, హైబీపీ, ఆల్కహాల్, మందులు కలిపి తీసుకోవడం వంటివి అతడి మరణానికి కారణాలని వైద్యులు ధృవీకరించారు. వయాగ్రా లాంటి మాత్రలు తీసుకునే విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆల్కహాల్‌తో కలిపి మందులు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మగవారిలో శృంగార సామర్ధ్యాన్ని పెంచేందుకు వాడే వయాగ్రా ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. అయితే, ఇది చాలా అరుదైన విషయమని వైద్య నిపుణులు చెబుతున్నారు.