Site icon Prime9

Patanjali Products: పతంజలికి చెందిన 14 ఉత్పత్తుల లైసెన్సులను రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

Patanjali products

Patanjali products

Patanjali Products: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం బాబా రాందేవ్‌కు చెందిన కంపెనీ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌, దివ్య ఫార్మసీపై కొరఢా ఝళిపించింది. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాందేవ్‌తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ ప్రొడక్టులతో అన్నీ రోగాలు మాయం అవుతాయని తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని సుప్రీంకోర్టు మండిపడింది. వెంటనే కోర్టుకు వచ్చి బాబా రాందేవ్‌తో పాటు బాలకృష్ణలు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా రాందేవ్‌ బాబాకు చెందిన సుమారు 14 ఉత్పత్తుల లైసెన్స్‌ను రద్దు చేస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు కూడా తక్షణమే అమలు అవుతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తోందని..(Patanjali Products)

రాష్ర్టప్రభుత్వ లైసెన్సింగ్‌ అధారిటి ఒక ప్రకటనలో పతంజలి ఆయుర్వేద తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తోందని, అందుకే పతంజలితో పాటు దివ్యాఫార్మసీకి ఇచ్చిన లైసెన్సులను రద్దు చేసినట్లు ప్రకటించింది. మొత్తం 14 ఉత్పత్తులను లైసెన్సులను రద్దు చేసింది. వాటిలో స్వసారీ గోల్డ్‌, స్వసారి వాటి, బ్రోన్‌చోయ్‌, ముక్తావాటి ఎక్స్‌ట్రా పవర్‌, స్వసారి ప్రవాహి, స్వసవారి అవాలెహ్‌, లిపోడమ్‌, బీపీ గ్రిట్‌, మధుగ్రిట్‌, మధునాశిన్‌వాటి ఎక్స్‌ట్రాపవర్‌, లివామ్రిత్‌ అడ్వాన్స్‌, లివోగ్రిట్‌, ఐగ్రిట్‌ గోల్డ్‌, పతంజలి ద్రిష్టి ఐ డ్రాప్‌ లాంటి ఉత్పత్తులను తక్షణమే నిలిపివేయాలని రూల్‌ 159 (1) డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ కూల్స్‌ 1945 ప్రకారం నిలిపివేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ఆదేశించింది. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌ జిల్లా ఆయుర్వేదిక్‌ యునాని ఆఫీసర్‌, హరిద్వార్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ర్టేట్‌కు బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌పైకు వ్యతిరేకంగా సెక్షన్‌ 3,4, 7 కింద డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ (అబ్జెక్షనబుల్‌ అడ్వర్టయిజ్‌మెంట్స్‌ ) యాక్ట్‌ 1954 కింద అఫిడవిట్‌ సమర్పించింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును విచారించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని మండిపడింది. వెంటనే జాతీయపత్రికల్లో క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటనలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అయితే సుప్రీంకోర్టు బాబా రాందేవ్‌తో పాటు ఆచార్య బాలకృష్ణపై కోర్టు ధిక్కార కేసు విచారణ వాయిదా వేసింది. కాగా రాందేవ్‌ బాబాతో పాటు.. బాలకృష్ణలు జాతీయ పత్రికల్లో క్షమాపణలు కోరలేదు. ఇదిలా ఉండగా కోర్టు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పతంజలిపై వేలు చూపుతున్నప్పుడు.. నాలుగు వ్రేళ్లు.. మీ వైపు చూపుతాయన్నారు. మీ డాక్టర్లు కూడా అల్లోపతి మందులను ప్రిస్ర్కైబ్‌ చేస్తుంటారు. అవి కూడా పనిచేయవు .. అలాంటప్పుడు మీపై కూడా ఎందుకు చర్యలు తీసుకోరాదని ప్రశ్నించింది.

Exit mobile version
Skip to toolbar