Site icon Prime9

Criminal Death : యూపీలో మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ హతం..

Uttar pradesh wanted criminal gufrar death news

Uttar pradesh wanted criminal gufrar death news

Criminal Death : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్‌ క్రిమినల్‌ “గుఫ్రాన్‌” హతం అయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యూపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం కౌశంబీ జిల్లాలో తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలో గుఫ్రాన్‌ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే గుఫ్రాన్‌ కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందాడు. అతడి తలపై రూ.1.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన గుఫ్రాన్‌ పలు హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతాప్‌గఢ్‌లో ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి లూటీ చేశాడు. ఆ తర్వాత నుంచి పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నేడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. గుఫ్రాన్‌ తలపై ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు రూ.లక్ష, సుల్తాన్‌పుర్‌ పోలీసులు రూ.25వేల రివార్డు ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో వరుస ఎన్‌కౌంటర్‌లు జరిపి నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లను మట్టుబెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ కుమారుడితో పాటు పలువురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 2017 లో యోగి ఆదిత్యనాథ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 10వేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరగ్గా.. 185 మంది క్రిమినల్స్‌ను మట్టుబెట్టారని సమాచారం అందుతుంది.

Exit mobile version