Site icon Prime9

Eric Garcetti: ఢిల్లీలో జరిగిన దుర్గాపూజ వేడుకల్లో పాల్గొన్న అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి

Eric Garcetti

Eric Garcetti

Eric Garcetti: దేశవ్యాప్తంగా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ (సిఆర్ పార్క్)లో ఉన్న దుర్గాపూజ మండపాన్ని సందర్శించారు. అక్కడ నిర్వాహకులు ఆయనకు బెంగాలీ సంప్రదాయంలో స్వాగతం పలికారు. మండపంలో నిర్వహించిన పూజ వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.

’దునిచి‘ నృత్యం చేసి..(Eric Garcetti)

ఈ సందర్బంగా గార్సెట్టి పలువురు భక్తులతో కలిసి నృత్యం చేసారు. దుర్గాదేవి వేడుకల్లో భాగమయిన . నిప్పుల కుండను నోటిలో పెట్టుకుని నాట్యం చేసే ధునిచి నృత్యంలో కూడా ఆయన పాల్గొన్నారు. అనంతరం బెంగాలీ వంటకాలను రుచి చూసారు. జాల్ మూరీ, బిర్యానీ, చేపలు, స్వీట్లను తిని ఆనందించారు. దుర్గాదేవి వేడుకల్లో తాను పాల్గొని ఆనందించినట్లు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో పోస్ట్ చేసారు. ఢిల్లీలోని చిత్తరంజన్ దాస్ పార్కులో దుర్గాదేవి పూజా ఉత్సవాల్లో పాల్గొన్నాను. అద్బుతమైన బెంగాలీ వంటకాలను రుచి చూసాను. భారత దేశం అంతా విభిన్న వేడుకులు జరుగుతుంటాయి. ఈ అద్బుతమైన సాంస్కృతిక వైవిధ్యానికి నేను విస్మయం చెందుతాను అంటూ వ్రాసారు.

అతని పోస్ట్‌కి 200,000 కంటే ఎక్కువ వ్యూస్, 9,000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి.పలువురు నెటిజన్లు గార్సెట్టి పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. మీరు దుర్గాపూజ ఉత్సవాలను ఆస్వాదిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని ఒకరు రాశారు.మరొకరు వచ్చే ఏడాది ఉత్సవాల కోసం కోల్‌కతాను సందర్శించమని అతన్ని ఆహ్వానించారు.విభిన్న సంస్కృతులకు మరియు తేడాలను అంగీకరించడానికి చాలా పెద్ద మరియు ప్రేమగల హృదయం అవసరం. ప్రేమను పంచినందుకు ధన్యవాదాలు అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.

 

 

 

Exit mobile version