Site icon Prime9

Uttar Pradesh: అతితక్కువ వర్షపాతం.. కరువు దిశగా ఉత్తరప్రదేశ్

Uttar Pradesh: భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కరువు దిశగా పయనిస్తోంది. భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం, దాని 75 జిల్లాల్లో(96 శాతం) జూలై 20, 2022 వరకు ‘సాధారణం కంటే తక్కువ’ వర్షపాతం నమోదైంది. 75 జిల్లాల్లో యాభై తొమ్మిది జిల్లాల్లో ‘అత్యంత తక్కువ’ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలు ‘పెద్ద లోటు’ను ఎదుర్కొంటున్నాయి. అంటే 60 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

మరో 13 జిల్లాల్లో 20-59 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు జిల్లాల్లో స్వల్పంగా (90-98 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూలై 20, 2022 నాటికి రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం లోటు ఉన్న జిల్లా కౌశాంబి. సాధారణం కంటే 98 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత గోండా జిల్లాలో 91 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బండ జిల్లాలో 91 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కాన్పూర్ (రూరల్)లో సాధారణం కంటే 90 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

జూలై 17 నాటికి రాష్ట్రం మొత్తం మీద 45 శాతం వరి నాట్లు మాత్రమే జరిగాయి. కరువు మరియు సహాయానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేదు.

Exit mobile version
Skip to toolbar