India to Meet Today India-Pakistan Tensions: యూఎన్‌ఎస్‌సీ అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను యూఎన్‌ఎస్‌సీ చర్చించనుంది. ఈ ఉద్రిక్తతలపై క్లోజ్డ్ కన్సల్టేషన్‌ను పాక్ కోరింది. భారత్ చర్యలు శాంతిభ్రదతలకు హాని కలిగిస్తున్నాయని పేర్కొంది.
అయితే, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి అంశాలను యూఎన్‌ఎస్‌సీ దృష్టికి పాక్ తీసుకెళ్లనుంది. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తున్న అంశాన్ని యూఎన్‌ఎస్‌సీ దృష్టికి భారత్ తీసుకెళ్లనుంది. కాగా, ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడిని యూఎన్‌ఎస్‌సీ ఖండించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై పోరుకు భారత్‌కు యూఎన్‌ఎస్‌సీ మద్దతు తెలిపింది.
ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఉగ్రవాదులు ఎస్ఎస్‌జీ కమాండో తరహాలో కఠోర శిక్షణ తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా జమ్ముకశ్మీర్ జైళ్లలోని లష్కరే ఉగ్రవాదుల నుంచి సమాచారం రాబట్టగా.. కశ్మీర్ లోయలో ఇలాంటి కమాండోలు దాదాపు 15 నుంచి 20 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన గగన్ గిర్, గాందర్బల్, బూటా ప్రతి దాడుల్లో వీరంతా కీలక పాత్ర పోషించారు.