Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్ 2023-24 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవార ఉదయం 11 గంటలకు లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
బడ్జెట్ హైలెట్స్:
ముగిసిన బడ్జెట్ ప్రసంగం(Union Budget 2023-24)
బడ్జెట్ ప్రసంగం 1 గంటా 26 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సాగింది.
వేతన జీవులకు ఊరటనిస్తూ పన్ను విధానాల్లో మార్పులను ప్రకటిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు ఆర్థిక మంత్రి.
ఆదాయపు పన్నుపై 5 కీలక ప్రకటనలు(Union Budget 2023-24)
ఆదాయపు పన్నుపై 5 కీలక ప్రకటనలు చేసిన నిర్మలా సీతారామన్
9 లక్షల ఆదాయం ఉన్నవాళ్లు కట్టే పన్ను ఇక 45 వేలే
ఆదాయపు పన్ను తగ్గింపు వల్ల కేంద్రానికి 35 వేల కోట్లు నష్టం
వేతన జీవలకు ఊరట. ఆదాయ పన్ను పరిమితి పెంపు. 7 లక్షల వరకూ పన్ను మినహాయింపు. వార్షిక ఆదాయం ఉన్న 7 లక్షల వరకూ ఉన్న ఉద్యోగులకు ఎలాంటి పన్ను ఉండదు.
వాహనాల టైర్ల ధరలు పెంపు
భారీగా పెరగనున్న బంగారం , వెండి, డైమండ్ ధరలు
పెరగనున్న సిగరెట్ ధరలు, బ్రాండెడ్ దుస్తుల ధరలు.
తగ్గనున్న మొబైల్స్, టీవీలు
ఉద్యోగుల పన్ను స్లాబుల్లో మార్పు. 15 లక్షల దాటితే 30 శాతం పన్ను.
16 రోజుల్లోనే ఐటీ రిటర్నుల పరిష్కరణ
గ్రామీణ బ్యాంకుల్లో కూడా 2 లక్షల వరకూ క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు.. 3 కోట్లు క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇల్లు అమ్మితే వచ్చే రూ.10 కోట్ల వరకు ఈ పన్ను మినహాయింపు
కోవిడ్, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ మెరుగ్గా వృద్ధి చెందుతోంది. అమృత కాలంలో వస్తున్న తొలి బడ్జెట్.
ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు అడుగడుగునా అండగా ఉంటుంది. ప్రపంచ సవాళ్లను దేశ ఆర్థిక వ్యవస్థను ధీటుగా ఎదుర్కొంది.
సబ్‌కా సాథ్.. సబ్‌కా ప్రయాస్.. మారిన మోదీ ప్రభుత్వ స్లోగన్.
వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాము. వ్యవసాయ రంగంలో స్టార్టప్స్‌ను పెంపొందించేందుకు ఓ ఫండ్‌ను ఏర్పాటు. అగ్రికల్చర్ యాక్సలేటర్ ఫండ్.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. 2047 లక్ష్యంగా పథకాలు ప్రవేశపెడుతున్నాం సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది.
వ్యవసాయ అభివృద్దికి ప్రత్యేక నిధి.
నిర్మలా సీతారామన్ ప్రసంగం..(Union Budget 2023-24)
రసాయన ఎరువుల స్థానంలో సంప్రదాయ ఎరువుల తయారీకి ప్రోత్సాహం. 5 కోట్ల రైతులు సంప్రదాయ వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సాహాలు
సామాన్యుల సాధికారతే బడ్జట్ లక్ష్యం. యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ప్రారంభం.
9 ఏళ్లలో భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. వృద్ధి రేటు 7 శాతం గా ఉంటుందని అంచనా వేస్తున్నాం. సప్తరుషి పేరుతో 7 రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్.
మహిలా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నాం. మహిళల కోసం మరిన్ని పథకాలు.
గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహంచిలే ప్రోత్సహకాలు. ఉద్యాన వన పంటలకు ప్రాధాన్యత.
ఆత్మ నిర్భర్ భారత్ లో చేనేత వర్గాలకు లబ్ది చేకూరుతుంది.
ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం. రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత.
భారత్ లో యూపీఐ చెల్లింపులు పెరిగాయి. గతేడాదిలో 126 లక్షల కోట్ల డిజిటల్ పేమెంట్లు జరిగాయి.
దళితుల అభివృద్దికి ప్రత్యేక పథకాలు. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండనుంది.
చిరుధాన్యాల పంటకు ప్రత్యేక ప్రోత్సహకాలు. 2024 వరకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగిస్తాం.
ఈ పీ ఎఫ్ ఓ సభ్యుల సంఖ్య పెరిగింది.
50 ఎయిర్ పోర్టులు, పోర్టుల పునరుద్ధరణ.
శ్రీ అన్నంలో మనమే టాప్. సహకార సంఘాల్లోనే పంట దాచుకునేలా పంచాయితీ గోడౌన్లు.
దేశ వ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు. . 38 వేల 800 ఉపాధ్యాయుల నియామకం. 3.5 లక్షల గిరిజన విద్యార్థులకు
గిరిజన్ మిషన్ కోసం 10 వేల కోట్లు
క్లీన్ ప్లాంట్ కోసం 2 వేల కోట్లు
నిర్మలా ప్రసంగం సాగిందిలా..(Union Budget 2023-24)
మత్స్య కారుల కోసం భారీగా నిధుల కేటాయింపు. 6 వేల కోట్లు కేటాయింపు.
కోత్త రైల్వే లైన్ల నిర్మాణాని ప్రాధాన్యత. రైల్వేల్లో పెట్టుబడి 2.40 లక్షల కోట్లు
రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు కొనసాగింపు. 13.7 లక్షల కోట్ల వడ్లీ లేని రుణాలు.
18 లక్షల సెల్ఫ్ హెల్స్ గ్రూపుల ఏర్పాటు.
జమ్మూ కశ్మీర్, లఢఖ్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్దపై ప్రత్యేక దృష్టి. లద్దాఖ్‌లో 13 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి.
ఈ కోర్టుల ప్రాజెక్టు కు 7 వేల కోట్ల నిధులు కేటాయింపు.
వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
5జీ సర్వీసుల కోెసం 100 ప్రత్యేక ల్యాబ్ లు.
కోవిడ్ సమయంలో నష్టపోయిన ఎమ్ఎస్ఈ లుకు రిఫండ్ పధకం.
కొత్తగా 3 ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సెంటర్లు ప్రారంభం
మేక్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం.
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకు ప్రత్యేక నిధులు. కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాలకు, సాగు రంగానికి రూ. 5,300 కోట్లు.
పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి యువతకు శిక్షణ.
దేఖో అప్నా దేఖ్ పథకం ప్రారంభం
స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిట్ మాల్స్.
వ్యక్తి గత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, డీజీ లాక్
ప్రపంచ స్థాయిలో మిల్లెట్ భారత్ ను రూపొందించడమే లక్ష్యంగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/