Site icon Prime9

Union Budget 2023-2024: వేతన జీవులకు భారీ ఊరట.. ఎదురు చూసిన కబురు వచ్చేసింది

income tax

income tax

Union Budget 2023-2024: నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.

 

వేతన జీవులకు భారీ ఊరట

ఈ బడ్జెట్ లో వేతన జీవులను ఊరట లభించింది. రూ. 5 లక్షల పన్ను పరిమితిన రూ. 7 లక్షలకు పెంచారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల పన్ను శ్లాబులను 6 నుంచి 5 కి తగ్గించారు. మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించేలా.. నూతన పన్ను విధానంలో మార్పులు చేశారు.

6 నుంచి ట్యాక్స్‌ స్లాబ్ల్స్‌ నుంచి 5 కి తగ్గింపు
ఆదాయం రూ. 0. 3లక్షలకు ఎలాంటి పన్ను పరిమితి లేదు.
రూ. 3-6 లక్షల ఆదాయం ఉన్నవారు 5 శాతం పన్ను చెల్లించాలి.
ఇక రూ. 12-15 లక్షల మధ్య ఉన్నవారు తమ ఆదాయంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 15 లక్షలు దాటితే మాత్రం వారు.. 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.

దీని ప్రకారం రూ.7లక్షల ఆదాయం దాటితే.. రూ. 3 లక్షల ఆదాయం నుంచి మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను రిటర్న్‌ల ప్రాసెసింగ్ సమయాన్ని కూడా తగ్గించారు.
ఇది వరకు ఉన్న 93 రోజుల సమయాన్ని 16 రోజులకు తగ్గించారు.

ఈ బడ్జెట్ లో ఏడు అంశాలకు ప్రాధాన్యం

సమ్మిళత వృద్ధి

చివరి వ్యక్తులకు లబ్ధి

మౌలిక సదుపాయాలు

సామర్థ్యాలను గుర్తించడం

హరిత వృద్ధి

యువ శక్తి

ఆర్థిక రంగం బలోపేతం.. వంటి అంశాలను ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ Union Budget 2023-24లో అన్న వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. తొమ్మిదేళ్లలో.. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారిందని అన్నారు. మరోవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. రెండెళ్ల సమయానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో ఫిక్స్ డ్ డిపాజిట్ పై 7.5 స్థిర వడ్డి ఇవ్వనున్నారు. మహిళలు గరిష్టంగా ఈ పథకంలో రూ. 2లక్షలు డిపాజిట్ చేయవచ్చు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version