African swine: ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో రెండువేల పందుల మృతి

మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 2,000కు పైగా పందులు చనిపోయాయి.దీనితో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 144 ప్రకారం పందుల రవాణా, కొనుగోలు మరియు వాటి మాంసం మరియు వాటి మాంసాన్ని నిషేధిస్తూ కలెక్టర్ మనోజ్ పుష్పనిషేధాజ్ఞలు జారీ చేసారు.

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 12:35 PM IST

African swine: మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 2,000కు పైగా పందులు చనిపోయాయి.దీనితో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 144 ప్రకారం పందుల రవాణా, కొనుగోలు మరియు వాటి మాంసం మరియు వాటి మాంసాన్ని నిషేధిస్తూ కలెక్టర్ మనోజ్ పుష్పనిషేధాజ్ఞలు జారీ చేసారు.

భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) నమూనాలను పరీక్షించి, రేవా మున్సిపల్ పరిధిలోని పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌ని గుర్తించింది. రేవాలోని పందులు రెండు వారాల క్రితమే చనిపోవడం ప్రారంభించాయి. దీనితోపశుసంవర్ధక శాఖ నమూనాలను ప్రయోగశాలకు పంపింది

రేవానగరంలో 25,000కు పైగా పందులు ఉన్నాయని, వాటిలో అత్యధికంగా వ్యాధి సోకిన జంతువులు వార్డు 15లో ఉన్నాయని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ మిశ్రా తెలిపారు. కిలోమీటరు పరిధిలో ఉన్న పందులన్నింటిని పరీక్షించి ఆరోగ్యవంతమైన జంతువులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.