Rajasthan: సాధారణంగా మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ కేసులు నమోదయి వ్యక్తులను విచారణకు పిలవడం అందరికీ తెలిసిందే. అటువంటి ఈడీ అధికారులే లంచం తీసుకున్నారంటే వ్యవస్ద ఎలా ఉందో తెలుస్తుోంది. లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. వీరిని నీమ్రానాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
చిట్ ఫండ్ కేసులో కేసు నమోదవకుండా ఆపేందుకు ఇద్దరు అధికారులు రూ.15 లక్షలు అడిగారు. డబ్బు తీసుకుంటుండగా ఇద్దరు ఈడీ అధికారులు పట్టుకున్నారని రాజస్థాన్ ఏసీబీ తెలిపింది. దీనికి సంబంధించి వారి నివాసం, ఇతర ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఇడి అక్టోబర్ 30న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. నవంబర్ 25న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు ఈడీ విచారణను గెహ్లాట్ ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణను ముఖ్యమంత్రి అరవింద్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు మరియు నాయకులు కక్ష పూరిత చర్యగా పేర్కొంటున్నారు. 2024లో జాతీయ ఎన్నికలకు ముందు తమను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.