Site icon Prime9

Twin Towers: ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత నష్టం రూ.500 కోట్లు

Twin Towers demolition loss is Rs.500 crores

Twin Towers demolition loss is Rs.500 crores

Twin Towers: నోయిడాలోని ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత ద్వారా సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ రియల్టీ కంపెనీకి సుమారు 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం విషయానికి వస్తే నిర్మాణ వ్యయంతో పాటు బ్యాంకు వడ్డీలు తదితర అంశాలు కలిసి ఉన్నాయయని కంపెనీ చైర్మన్‌ ఆర్‌ కె అరోరా అన్నారు. సూపర్‌ టెక్ నోయిడాలో 100 మీటర్ల ఎత్తైన రెండు టవర్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించింది. సుప్రీంకోర్టు ఈ ట్విన్‌ టవర్లను కూల్చాలని ఆదేశించింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ట్విన్‌ టవర్స్‌ అపెక్స్‌, సెయెనీ కేవలం తొమ్మిది సెకన్లలో నేల కూలాయి. ఈ నిర్మాణాలను కూల్చడానికి 3,700 కిలోల మందుగుండు సామగ్రి వినియోగించారు. దీని కూల్చివేతకు 20 కోట్ల వరకు వ్యయమైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ట్విన్‌ టవర్స్‌ కూల్చడం వల్ల సుమారు 500 కోట్ల వరకు నష్టపోయామని చెప్పారు కంపెనీ చైర్మన్ అరోరి‌. భూమి కొనుగోలు, నిర్మాణ వ్యయం, నిర్మాణానికి కావాల్సిన అనుమతులు పొందడానికి, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీతో పాటు ఈ రెండు టవర్స్‌లో ప్లాట్‌లు కొనుగోలు చేసిన యజమానులకు వారి డబ్బు వారికి చెల్లించడంతో పాటు 12 శాతం వడ్డీ కూడా చెల్లించినట్లు ఆయన వివరించారు. మొత్తం 900 అపార్టుమెంట్లు ఈ ట్విన్‌ టవర్స్‌లో నిర్మించారు. వీటి విలువ సుమారు 700 కోట్ల వరకు ఉంటుందన్నారు అరోరా. ఈ రెండు టవర్స్‌లో మొత్తం 8 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు జరిగాయి. నోయిడా డెవలెప్‌మెంట్‌ అధారిటి ఇచ్చిన అనుమతుల ప్రకారమే తాము నిర్మాణాలు చేపట్టామని అరోరా చెబుతున్నారు. కూల్చివేతకు ఎంత ఖర్చయిందని అరోరాను ప్రశ్నిస్తే ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌కు 17.5 కోట్ల చెల్లించామని చెప్పారు. ఈ భవనాన్ని సురక్షితంగా కూల్చాల్సిన బాధ్యత ఎడిఫైస్‌దే. దీంతో పాటు భవనం పై 100 కోట్ల బీమా కూడా చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రీమియం కూడా చెల్లించినట్లు ఆయన తెలిపారు. కాగా ఎడిఫైస్‌.. దక్షిణాఫ్రికాకు చెందిన జెట్‌ డెమోలిషన్‌ ప్రాజెక్టు సేవలను వినియోగించుకుంది.

గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. ఈ టవర్స్‌లో ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారికి అసలుతో పాటు 12 శాతం వడ్డీ కలిసి ఇవ్వాలని దేశించింది. అలాగే రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు మరో 2 కోట్లు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా సూపర్‌ టెక్‌ 40 అంతస్తుల టవర్స్‌నిర్మించింది. మొత్తం 915 ఫ్లాట్స్‌తో పాటు 21 షాప్స్‌ నిర్మాణం చేపట్టింది. అయితే అరోరా చెప్పేది ఏమిటంటే ఈ ప్రాజెక్టుల కూల్చివేత వల్ల తమ ఇతర ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపదని అంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 70వేల యూనిట్ల కంటే ఎక్కువే నిర్మాణాలు చేపట్టామని విక్రయాలు జరిపామన్నారు. ఇతర ప్రాజెక్టులు యాధావిధిగా కొనసాగుతాయని తమ ప్రాజెక్టులో ఫ్లాట్స్‌ కొనుగోలు చేసిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నారు.

Exit mobile version