Site icon Prime9

‘Hit-and-Run’ Law: ‘హిట్-అండ్-రన్’ నిబంధనపై రోడ్డెక్కిన ట్రక్కు డ్రైవర్లు..

truck drivers

truck drivers

Hit-and-Run’ Law:  ‘హిట్-అండ్-రన్’ నిబంధనపై డ్రైవర్లు మరియు ట్రక్కర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో వివిధ రాష్ట్రాలలో నిరసనలు వెల్లువెత్తాయి. వీరి ఆందోళన రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాను దెబ్బతీస్తుందనే భయంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో రాష్ట్రాలలో పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు క్యూలు కట్టారు.

కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని పలు ప్రొవిజన్‌లను మార్చింది. దీనికి ఇటీవలే పార్లమెంటు కూడా ఆమోద ముద్ర వేసింది. కొత్తగా అమల్లోకి తెచ్చిన న్యూ క్రిమినల్‌ లా భారతీయ న్యాయ సన్హితను పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఆమోద ముద్ర కూడా పడింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో భారతీయ న్యాయ సన్హితను అందుబాటులోకి తెచ్చింది. ఒక వేళ డ్రైవర్‌ రోడ్డు ప్రమాదానికి కారకుడైతే.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చట్టం నుంచి తప్పించుకు తిరిగి పది సంవత్సరాల శిక్షతో పాటు ఏడు లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దీన్ని దేశంలోని బస్సు డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతరేకిస్తున్నారు.

పెట్రోల్ బంకుల వద్ద క్యూలు ..(‘Hit-and-Run’ Law)

దీనితో దేశవ్యాప్తంగా ట్రక్కర్లు కొత్త చట్టానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఆదివారం నాడు పశ్చిమ బెంగాల్‌లో వందలాది ట్రక్క డ్రైవర్లు జాతీయ రహదారి రెండు వద్ద ఉన్న హుగ్లీ జిల్లాలోని డన్‌కుని టోల్‌ ప్లాజావద్ద రెండు గంటలపాటు రోడ్‌ బ్లాక్‌ చేశారు. టైర్లను కాల్చి.. రోడ్డు మధ్యలో తమ ట్రక్కులను పార్క్‌ చేసి నిరసన తెలిపారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రక్‌ డ్రైవర్ల నిరసన ప్రభావం మహారాష్ర్ట, పంజాబ్‌లో కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టంలోని ప్రొవిజన్లను డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీనితో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పౌరులు ఆందోళనతో పెద్ద ఎత్తున పెట్రోల్‌ పంపులకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు పెట్రోల్‌ పంపుల వద్ద బారులు తీరారు.మహారాష్ట్రలోని  నాగపూర్‌, థానే, జల్గాంవ్‌, దూలేలోని ప్రజలు పెట్రోల్‌ కోసం చాంతాడంత క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి రోడ్లు బ్లాక్‌ కాకుండా చూస్తున్నారు. ముఖ్యంగా నాగపూర్‌లో పెట్రోల్‌ పంపుల వద్ద భారీ క్యూ లైన్‌లు కనిపించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అమృత్‌సర్‌, పటియాలాలో కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు రోడ్డెక్కారు. అమృతసర్‌లో పెట్రోల్‌ స్టేషన్ల వద్ద చాంతాడంత క్యూలు కనిపించాయి. కాగా వరుసగా రెండో రోజు ట్రక్క్‌ డ్రైవర్లు సమ్మె పాల్గొంటున్నారు. కాగా స్థానికులు మాత్రం ట్రక్కు డ్రైవర్ల అసోసియేషన్‌ తో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని పంజాబ్‌ ప్రజలు కోరుతున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కూడా డ్రైవర్ల నిరసనలు. అదే సమయంలో పెట్రోలు బంకుల వద్ద చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి.

Exit mobile version