Transgender Couple: కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట జియా పాయల్, జహాద్ తల్లిదండ్రులు అయ్యారు.
కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సిజేరియన్ ద్వారా పండంటి బిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని జియా పావల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అయితే పుట్టింది ఆడ బిడ్డా.. మగ బిడ్డ అనేది ఇపుడే చెప్పబోమని ఈ జంట ప్రకటించింది.
డెలివరీ తర్వాత బిడ్డ, జహాద్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జహాద్, జియా జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ట్రాన్స్ జెండర్ల కమిటీ కూడా ఈ విషయం పై సంతోషం వ్యక్తం చేసింది.
తన బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను జియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బిడ్డ ఆరోగ్యంగా ఉందని .. తల్లిదండ్రులు కావాలనే కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని జియా ఉద్వేగానికి లోనైంది.
తమ వార్త తెలిసినప్పటి నుంచి చాలా మంది శుభాకాంక్షలు తెలిపారని.. తమకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ జంట.
కాగా, జియా, జహద్ ఇద్దరూ మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు గత వారం సోషల్ మీడియా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందవే.
అయితే ఈ లోపలే జహాద్ ప్రసవం అయింది. కోజిగడ్ కు చెందిన ఈ జంట గత మూడేళ్లుగా సహజీవనం చేస్తోంది.
‘తల్లి కావాలనుకున్న నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనున్నాయి. జహాద్ ఇప్పుడు ప్రెగ్నెంట్’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్ ఇన్ స్టాలో పోస్టు పెట్టింది.
అయితే ఓ ట్రాన్స్ జెండర్ జంట బిడ్డకు జన్మనివ్వడం దేశంలోనే ఇదే తొలిసారి.
దీంతో సంతానం కోసం అబ్బాయిగా మారే చికిత్సను జహాద్ వాయిద్ వేసుకుంది.
అబ్బాయిలా మారాలనుకుని జహద్ ఇదివరకే శస్త్రచికిత్స ద్వారా తన వృక్షోజాలను తొలగించుకున్నారు.
ఆ తర్వాత ప్రక్రియ జరిగే లోపల గర్భం వచ్చింది.
ఈ జంట ఇదివరకే ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని ప్రయత్నాలు చేసింది. అయితే వారికి దత్తత ప్రక్రియ పెద్ద సవాల్ గా మారింది.
బయోలాజికల్ గా జహద్ ఇంకా అమ్మాయి కావడంతో.. సాధారణ పద్దతిలో బిడ్డను జన్మనిచ్చే అవకాశముందని అనుకున్నారు.
అందుకే అబ్బాయిగా మారే ప్రక్రియను వాయిదా వేశారు.
ఇద్దరి ట్రాన్స్ జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కానుందన పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని కోజికోడ్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు తెలిపారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/