Transgender Couple Pregnancy: తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట.. దేశంలోనే తొలిసారి

దేశంలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కేరళ కు చెందిన జియా, జహద్ ఇద్దరూ మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

Transgender Couple Pregnancy: దేశంలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.

కేరళ కు చెందిన జియా, జహద్ ఇద్దరూ మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

ఈ సంతోషకర విషయాన్ని జియా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

కోజిగడ్ కు చెందిన జియా పావల్ , జహద్ గత మూడేళ్లుగా ఈ జంట సహజీవనం చేస్తోంది.

‘తల్లి కావాలనుకున్న నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనున్నాయి. జహాద్ ఇప్పుడు ప్రెగ్నెంట్’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్ ఇన్ స్టాలో పోస్టు పెట్టింది.

అయితే ఓ ట్రాన్స్ జెండర్ జంట బిడ్డకు జన్మనివ్వడం దేశంలోనే ఇదే తొలిసారి.

దీంతో సంతానం కోసం అబ్బాయిగా మారే చికిత్సను జహాద్ వాయిద్ వేసుకుంది.

వాయిదా పడ్డ లింగమార్పడి (Transgender Couple Pregnancy)

జియా పుట్టుకతోనే మగవాడు. అయితే లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాలని నిర్ణయించుకున్నాడు.

ఇక పుట్టుకతోనే అమ్మాయి అయిన జహద్ కూడా లింగమార్పిడితో అబ్బాయిగా మారాలనుకుంది.

ఈ క్రమంలో జహద్ గర్భం దాల్చడంతో.. లింగ మార్పిడి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.

అబ్బాయిలా మారాలనుకుని జహద్ ఇదివరకే శస్త్రచికిత్స ద్వారా తన వృక్షోజాలను తొలగించుకున్నారు. ఆ తర్వాత ప్రక్రియ జరిగే లోపల గర్భం వచ్చింది.

అయితే పుట్ట బోయే బిడ్డ బ్రెస్ట్ ఫీడింగ్ కోసం దాతలను ఆశ్రయిస్తామని ఈ జంట చెబుతోంది.

తాను పుట్టుకతోనే అమ్మాయిని కాకపోయినప్పటికీ ఓ బిడ్డ తో అమ్మా అని పిలిపించుకోవాలని కలలు కనేదాన్ని అని జియా తెలిపింది.

జహద్ కూడా నాన్న కావాలనుకున్నాడని.. ఎట్టకేలకు తమ కల నెరవేరిందని చెప్పింది. మరో నెలలో మా బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతోందని ఆనందం వ్యక్తం చేసింది.

సవాల్ గా మారిన దత్తత

ఈ జంట ఇదివరకే ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని ప్రయత్నాలు చేసింది. అయితే వారికి దత్తత ప్రక్రియ పెద్ద సవాల్ గా మారింది.

బయోలాజికల్ గా జహద్ ఇంకా అమ్మాయి కావడంతో.. సాధారణ పద్దతిలో బిడ్డను జన్మనిచ్చే అవకాశముందని అనుకున్నారు.

అందుకే అబ్బాయిగా మారే ప్రక్రియను వాయిదా వేశారు. ఇద్దరి ట్రాన్స్ జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కానుందన పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని కోజికోడ్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు తెలిపారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/