Site icon Prime9

Train coach: రైలు కోచ్‌ను రెస్టారెంట్‌గా మార్చేసారు..

Train coach

Train coach

West Bengal: సాధారణ రెస్టారెంట్లలో భోజనం చేయడం రొటీన్ గా మారిందా? ఇటువంటివారికోసం భారతీయ రైల్వే ఒక వినూత్నమైన రెస్టారెంట్ ను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని న్యూ జల్పాయ్ గురి రైల్వే స్టేషన్‌లో పాత రైలు కోచ్‌ని ప్రజలకు పలు చికరమైన వంటకాలను అందించే రెస్టారెంట్‌గా మార్చారు.

ఈ ‘రైల్ కోచ్ రెస్టారెంట్’లో 32 మంది అతిథులు కూర్చోవచ్చు. నార్త్ ఇండియన్-సౌత్ ఇండియన్ నుండి చైనీస్ వరకు వివిధ రకాల వంటకాలను అందిస్తోంది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సుక్నా, తింధరా, కుర్సియోంగ్ మరియు డార్జిలింగ్ స్టేషన్లలో కూడా ఇటువంటి రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ రెస్టారెంట్ రైల్వే ఆదాయాన్ని పెంపొందించడమే కాకుండా రైలు కోచ్‌లో భోజనం చేసే ప్రత్యేక అనుభూతిని పొందగలుగుతారు” అని న్యూ జల్పాయ్ గురి జంక్షన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ సంజయ్ చిల్వార్వార్ అన్నారు. రైల్వే ప్రయాణికులే కాదు, ఎవరైనా వచ్చి రెస్టారెంట్‌లో భోజనం చేయవచ్చని అన్నారు.

అధిక సంఖ్యలో ప్రజలు  న్యూ జల్పాయ్ గురి స్టేషన్ గుండా ప్రయాణిస్తుంటారు మరియు వారు తినడానికి సమీపంలోని ప్రదేశాల కోసం చూస్తారు. వారు ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాము” అని రెస్టారెంట్ ఆపరేటర్ శిశిర్ హల్దార్ అన్నారు. పాత కోచ్‌ను పునరుద్ధరించిన తర్వాత, రైల్వే దానిని లైసెన్స్‌ దారుకు అందజేసిందని, అతను రెస్టారెంట్ ఏర్పాటుకు మరో రూ. 30 లక్షలు వెచ్చించాడని ఒక అధికారి తెలిపారు. 40 మంది సిబ్బందితో సేవలందిస్తున్న ఈ రెస్టారెంట్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు.

Exit mobile version