Newly married couple: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో గురువారం కొత్తగా పెళ్లయిన జంట వివాహం జరిగిన మరుసటి రోజు ఉదయం మరణించిన సంఘటన సంచలనం కలిగించింది. వధూవరులు గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
ఒకే చితిపై అంత్యక్రియలు..(Newly married couple:)
22 ఏళ్ల ప్రతాప్ యాదవ్ 20 ఏళ్ల పుష్పను మే 30న వివాహం చేసుకున్నాడు. కొత్తగా పెళ్లయిన జంట మరునాడు తమ గదిలో నిద్రించడానికి వెళ్లి మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా మారారు. ప్రతాప్‌కు మంగళవారం రాత్రి పుష్పకు వివాహం జరిగింది. బుధవారం రాత్రి తమ గదిలోకి వెళ్లిన జంట గురువారం మధ్యాహ్నం వరకు గదిలో నుంచి రాకపోవడంతో వరుడి కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేసారు. దీనితో వారిని లేపడానికి ప్రయత్నించగా చనిపోయి కనిపించారు. గ్రామంలోని ఒకే చితిపై దంపతులకు అంత్యక్రియలు నిర్వహించారు.,
గదిలోకి బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేదా దంపతుల శరీరంపై గాయం గుర్తులు లేవని వారి మరణాలలో నేర కోణం లేదని గుండెపోటుతో బాధపడుతున్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో ఉందని అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం మరణాల వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి గది మరియు పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.భార్యాభర్తలిద్దరికీ ఒకేసారి గుండెపోటు వచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని బహ్రైచ్ ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు. ఈ జంట మరణాల వెనుక మిస్టరీని ఛేదించేందుకు లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో తదుపరి పరీక్షల కోసం రెండు మృతదేహాల లోపలి భాగాలను భద్రపరిచినట్లు వర్మ తెలిపారు.