Site icon Prime9

IAS officer: ఈ రోజు శానిటరీ ప్యాడ్స్.. రేపు కండోమ్స్ కూడా అడుగుతారు.. ఐఏఎస్ అధికారిణి సంచలన వ్యాఖ్యలు

IAS

IAS

Bihar: బీహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఒక విద్యార్దిని ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరగా రేపు కండోమ్స్ కూడా అడుగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

పాట్నాలో జరిగిన ‘సశక్త్ బేటీ, సమృద్ధ్ బీహార్’ (సాధికారత కలిగిన కుమార్తెలు, సంపన్న బీహార్) కార్యక్రమంలో భాగంగా బీహార్ మహిళా అభివృద్ధి సంస్థ ఎండి హర్జోత్ కౌర్‌తో పరస్పర చర్చ సందర్భంగా ఒక విద్యార్దిని అనేక ఉచితాలను అందించే ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ ఎందుకు అందించలేదో తెలుసుకోవాలని కోరింది. అక్కడ హాజరయినవారందరూ ఈ ప్రశ్నకు సంతోషంగా చప్పట్లు కొట్టారు, కాని కౌర్ తిక్కతిక్కగా సమాధానమిచ్చారు. మీరడిగినట్టుగానే ప్రభుత్వం మీకు శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంది. రేపు మీరు జీన్స్, ప్యాంట్స్, షూస్ కావాలని అడుగుతారు. ఇక ఫ్యామిలీ ప్లానింగ్ విషయానికొస్తే ప్రభుత్వం నుంచి కండోమ్‌లు కూడా కోరుకుంటారని కామెంట్ చేశారు.

దీనిపై సదరు విద్యార్దిని ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మా దగ్గరకు వస్తారుగా అన్నపుడు హర్జోత్ కౌర్ మండిపడ్డారు. నువ్వు ఓటు వేయకు, పాకిస్థాన్ వెళ్లిపో. ప్రభుత్వం తరపున సౌకర్యాలు, డబ్బు తీసుకునేందుకే ఓటు వేస్తున్నావు” అని మండిపడ్డారు. దీనికి వెంటనే ఆ బాలిక నేను ఇండియన్‌ని. పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లిపోతాను అని ప్రశ్నించింది. తరువాత మరో బాలిక టాయిలెట్స్ సరిగా ఉండటం లేదని, కొందరు అబ్బాయిలూ తమ టాయిలెట్స్‌లోకి వస్తుంటే ఇబ్బందిగా ఉందని చెప్పింది. దీనికి హర్జోత్ కౌర్ సమాధానం చెప్పకుండా ఇక్కడున్న అమ్మాయిలందరి ఇళ్లలో వాళ్లకు సెపరేట్ టాయిలెట్స్‌ ఉన్నాయా అని ప్రశ్నించింది. ఈ మహిళా అధికారిణి సమాధానాలపై అక్కడున్న వారందరూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Exit mobile version