Site icon Prime9

ICU Marriage: తల్లి ఆఖరి కోరిక తీర్చేందుకు ఐసీయూ దగ్గరే పెళ్లి చేసుకున్న కూతురు.. కొన్ని గంటలకే మృతి

Bihar

Bihar

Bihar: తీవ్ర అస్వస్థతకు గురైన ఓ తల్లి తన కూతురు తన ఎదుటే పెళ్లి చేసుకోవాలన్న ఆఖరి కోరిక నెరవేరింది. అయితే పెళ్లయిన కొన్ని గంటలకే ఆ మహిళ దురదృష్టవశాత్తు మరణించింది. బీహార్‌లోని గయాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూ వెలుపల జరిగిన పెళ్లి చర్చనీయాంశంగా మారింది. గురారు బ్లాక్‌లోని బాలి గ్రామానికి చెందిన లాలన్ కుమార్ భార్య పూనమ్ కుమారి వర్మ గయాలోని మేజిస్ట్రేట్ కాలనీలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు.

పూనమ్ తన కుమార్తె చాందినిని తన కళ్లముందే వివాహం చేసుకోవాలనేది తన చివరికోరికంటూ తెలిపింది. చాందిని వివాహం గురువా పోలీస్ స్టేషన్ పరిధిలోని సేలంపూర్ గ్రామానికి చెందిన సుమిత్ గౌరవ్ తో నిశ్చయించారు.వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు డిసెంబర్ 26 తేదీని ఫిక్స్ చేశారు. పూనమ్ తన చివరి కోరికను చెప్పడంతో, సుమిత్ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసారు.దీనితో ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో ఆసుపత్రిలోనే వివాహం చేయాలని నిర్ణయించుకున్నాయి.

సుమిత్ గౌరవ్ మరియు చాందిని ఆసుపత్రిలో ఐసీయూ వెలుపల వివాహం చేసుకున్నారు. ఈ సందర్బంగా చాందిని మాట్లాడుతూ, తన తల్లి పూనమ్ మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆక్సిలరీ నర్సు మరియు మంత్రసాని గా పనిచేస్తున్నారని కరోనా కాలం అనారోగ్యంతో ఉందని చెప్పిందితల్లి కోరిక తీర్చేందుకే ఆసుపత్రిలో పెళ్లి చేసుకున్నట్లు చాందిని తెలిపింది. పెళ్లయిన రెండు గంటలకే తల్లి కన్నుమూసింది.

Exit mobile version