Site icon Prime9

West Bengal: పెళ్లింట పెను విషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం

fie accident in tamilnadu kanchipuram district and 7 members died

fie accident in tamilnadu kanchipuram district and 7 members died

West Bengal: పెళ్లింట బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. చావుడప్పులు మోగాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. ఒకే ఇంటికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఇందులో పెళ్లికొడుకుతో సహా.. ఇద్దరు సోదరీమణులు చనిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.

పెళ్లింట విషాదం..

పెళ్లింట బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. చావుడప్పులు మోగాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. ఒకే ఇంటికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఇందులో పెళ్లికొడుకుతో సహా.. ఇద్దరు సోదరీమణులు చనిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు చెందిన సోరెన్, సుమీ సోరెన్, బహమీ సొరెన్ ముగ్గురు తోబుట్టువులు. వీరు దుర్గాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే.. మంగళ్‌ సోరెన్‌కు వివాహం నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరఫు కుటుంబసభ్యులు మంగళ్‌ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే మంగళ్‌ సోదరీమణులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు.

సుమీ సోరెన్‌ కోల్‌కతాలో నర్సుగా పనిచేస్తుండగా.. బహమనీ గృహిణి. వీరి తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదో పని మీద మార్కెట్‌కు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి మంటలు వస్తున్నాయి. వెంటనే తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడున్నారు. హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియట్లేదని స్థానికులు తెలిపారు.

Exit mobile version