Family Court: ఇద్దరు భార్యలు ఒకే భర్త విషయంలో గొడవపడ్డారు. దీంతో ఏ భార్యకు ఇబ్బంది కలగకుండా.. భర్తను సమానంగా విభజించింది మధ్యప్రదేశ్ లోని ఓ ఫ్యామిలీ కోర్టు.. ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.
సినిమా తరహాలో మూడు రోజులు.. (Family Court)
తెలుగు సినిమా ‘ఏవండి ఆవిడ వచ్చింది’ అనే తరహాలోనే ఓ ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన శోభన్‌బాబుకు వాణిశ్రీ, శారదలు భార్యలుగా నటించారు. ఇక ఇందులో శోభన్ బాబు మూడు రోజులు ఒక భార్య వద్ద.. మరో మూడు రోజులు మరో భార్య దగ్గర ఉంటాడు. ఇక ఆదివారం తల్లిదండ్రుల వద్ద ఉంటాడు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరహాలోనే మధ్య ప్రదేశ్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఒకే భర్త కోసం ఇద్దరు భార్యలు కోర్టుకెక్కారు. ఈ ఇద్దరికి న్యాయం చేయాలని కోర్టు.. చార్మిత్రాత్మక తీర్పు ఇచ్చింది. వారంలో ఒక్కో భార్యతో మూడు రోజులు.. మరో భార్యతో మూడు రోజులు ఉండాలని తీర్పు ఇచ్చింది. ఇక ఆదివారం నీ ఇష్టం అంటూ కోర్టు సూచించింది.
ఫ్యామిలీ కోర్టు తీర్పు వైరల్..
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం హర్యాణాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అతడికి 2018లో గ్వాలియర్ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. 2020లో కరోనా కారణంగా భారత్‌లో లాక్‌డౌన్ విధించారు.
దీంతో ఆ వ్యక్తి తన భార్యను పుట్టింటికి పంపించాడు. లాక్‌డౌన్ ఎత్తివేసినా సరే ఆ వ్యక్తి తన భార్యను తీసుకెళ్లకుండా హరియాణా వెళ్లాడు.
ఆ తర్వాత అదే కంపెనీలో పని చేస్తున్న మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
భర్త వచ్చి తనని తీసుకెళ్తాడని ఎదురుచూసిన మొదటి భార్య ఓపిక నశించి.. హరియాణాకు వెళ్లింది. అప్పుడే తన భర్త మరో వివాహం చేసుకున్నాడన్న విషయం ఆమెకు తెలిసింది.
న్యాయం చేయాలంటూ.. గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 6 నెలల పాటు వారికి కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చింది.
చివరకు ముగ్గురితో చర్చలు జరిపిన కౌన్సెలర్ హరీష్ దివాన్.. సయోధ్య కుదిర్చారు. ఈ నిర్ణయాన్ని అతడి ఇద్దరు భార్యలు అంగీకరించారు.
ఈ తీర్పు తర్వాత ఆ భర్త తన భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.
ఇద్దరు భార్యలు ఒకే భర్త విషయంలో గొడవ పడగా.. ఏ భార్యకు ఇబ్బంది కలగకుండా భర్తను సమానంగా విభజించింది.
మిగిలిన ఆదివారం భర్త కోరిక మేరకు ఇద్దరు భార్యల్లో ఎవరితోనైనా ఉండొచ్చని ఒప్పందాన్ని కుదిర్చింది.