Site icon Prime9

Mukesh Ambani: రూ. 400 కోట్లు ఇవ్వాలంటూ ముకేశ్ అంబానీకి బెదిరింపులు

Mukesh Ambani

Mukesh Ambani

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి సోమవారం రూ. 400 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపుతామంటూ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది, గత 4 రోజులుగా పంపిన బెదిరింపుల ఈ మెయిల్స్ లో ఇది మూడవది కావడం విశేషం.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అంబానీకి అక్టోబర్ 27 నుంచి ఒకే ఈమెయిల్ ఐడీ నుంచి బెదిరింపు ఈ మెయిల్స్ వస్తున్నాయి. అన్ని బెదిరింపు ఈ మెయిల్స్ పెద్ద మొత్తాన్ని డిమండ్ చేశాయని అధికారులు తెలిపారు.శుక్రవారం వచ్చిన మొదటి బెదిరింపులో రూ.20 కోట్లు కోరారు. ఒకరోజు తర్వాత మరో ఈ మెయిల్‌లో పంపిన వారికి రూ.200 కోట్లు చెల్లించకుంటే అంబానీని కాల్చి చంపేస్తానని బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

బెల్జియం నుంచి వచ్చిన ఈ మెయిల్స్..(Mukesh Ambani)

మూడు ఈ మెయిల్స్ ఒకే ఈ మెయిల్ ఐడి నుండి పంపబడ్డాయని, పంపిన వ్యక్తి షాదాబ్ ఖాన్‌గా గుర్తించామని అధికారులు తెలిపారు. బెల్జియం నుంచి ఈ మెయిల్స్ పంపినట్లు అధికారులు తెలిపారు.మోసపూరిత గుర్తింపు ద్వారా ఈ మెయిల్స్ పంపబడి ఉండవచ్చనే ఊహాగానాలతో అధికారులు ఇప్పుడు ఈ మెయిల్ ఐడి యొక్క ప్రామాణికతను పరిశీలిస్తున్నారు. వారు పేర్కొన్న
ఈమెయిల్ చిరునామాకు సంబంధించి మరింత సమాచారాన్ని పొందడానికి బెల్జియమ్  ఈ మెయిల్  సర్వీస్ ప్రొవైడర్‌లతో అనుసంధానం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు మేరకు గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదయింది.

ఈ బెదిరింపు మెయిల్స్ పంపిన నిందితుడిని పట్టుకోవడానికి వేట కొనసాగుతోంది. గత ఏడాది, ముకేష్ అంబానీ మరియు అతని కుటుంబ సభ్యులను  చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు బిహార్‌లోని దర్భంగాకు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని అతనుబెదిరించాడు.

Exit mobile version
Skip to toolbar