Site icon Prime9

గుజరాత్: ఎమ్మెల్యేను నోట్ బుక్స్ తో తూకం వేసారు.. ఎందుకో తెలుసా?

Gujarat

Gujarat

Gujarat: సాధారణంగా రాజకీయనేతలకు పూలమాలలు వేసి స్వాగతం పలకడం తరచుగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో పండ్లు మరియు నాణేలతో కూడా తూకం వేస్తారు. అయితే గుజరాత్ లోని బనస్కాంత జిల్లా ఎమ్మెల్యే ప్రవీణ్ మాలికి భిన్నమైన స్వాగతం లభించింది. అతను మాలి ప్రాంతంలోని మల్గర్ గ్రామానికి చేరుకున్నప్పుడు, నోట్ పుస్తకాలతో తూకం వేశారు. గ్రామంలోని ప్రభుజీ తన్సాలి సోలంకి కుటుంబం తరపున ఆయనకు నోట్‌బుక్స్ తో తూకం వేశారు. ఇందుకోసం ఎమ్మెల్యే ప్రవీణ్ మాలి బరువుకు సరిసమానమైన నోట్ బుక్స్ తీసుకొచ్చారు. బీజేపీ గుజరాత్‌లోని కొత్త తరం నాయకులలో ప్రవీణ్ మాలి ఒకరు. అతను చాలా కాలంగా బీజేపీ యువజన విభాగంలో చురుకుగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దీసా స్దానంనుంచి గెలుపొందారు.

గెలిచిన తర్వాత, ప్రవీణ్ మాలికి స్వాగతం పలికేందుకు ప్రజలు చేరుకోగా అతను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. నాకు స్వాగతం పలికేందుకు పుష్పగుచ్ఛాలు, మెమెంటోలు తీసుకురావద్దు. వాటికి బదులుగా నోట్‌బుక్స్ ఇవ్వండి. ఎమ్మెల్యే చేసిన ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే చేసిన ఈ విజ్ఞప్తికి ప్రజలు సానుకూలంగా స్పందించారు. అతడిని కలవడానికి వచ్చిన వారు నోటు పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం ప్రారంభించారు. వీటన్నింటిని తాను పేదపిల్లల చదువుకు ఉపయోగిస్తానని మాలి తెలిపారు. ఇందులో భాగంగానే అతడిని నోట్ బుక్స్ తో తూకం వేసారు.

బనస్కాంత జిల్లాలోని దీసా స్థానం బీజేపీకి కంచుకోట. 2007, 2012లో లీలాధర్ వాఘేలా ఇక్కడి నుంచి గెలుపొందగా.. 2017లో శశికాంత్ పాండ్యా విజయం సాధించారు. ఈసారి ప్రవీణ్ కుమార్ మాలికి పార్టీ అవకాశం ఇచ్చింది. మాలి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ రాబరీపై 42 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు.

Exit mobile version
Skip to toolbar