Site icon Prime9

DK Shivakumar: ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు ఉండదు.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్

DK Shivakumar

DK Shivakumar

DK Shivakumar: ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ స్ఫష్టం చేసారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడిఎస్‌తో పొత్తుకు అవకాశాలు లేవు. మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 130-135 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికూర్జున్ ఖర్గే కూడా ప్రకటించారు.

గ్యాస్ సిలిండర్ ను ప్రార్దించండి.. (DK Shivakumar)

ధరల పెరుగుదల, అవినీతి, సుపరిపాలన, అభివృద్ధి ఇవే ప్రధానాంశాలని శివకుమార్ అన్నారు.అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి మా గ్యాస్ సిలిండర్‌లను చూసి ఓటు వేయండి. దానికి (సిలిండర్) పూలమాల వేయమని నా నాయకులందరికీ నేను సలహా ఇచ్చానని అన్నారు.కన్నడిగులారా! మీరు ఓటు వేయడానికి వెళ్లే ముందు, ఈ కర్మ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూడండి అని పార్టీ ట్వీట్ చేసింది. వీడియో వాయిస్‌ఓవర్‌లో ‘ఓటు వేయడానికి వెళ్లే ముందు (ముందు) గ్యాస్ సిలిండర్‌ను ప్రార్థించండి’ అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పాత ప్రసంగం ఉంది.

అలాగే, అధికార బీజేపీపై కాంగ్రెస్ ప్రదానంగా ‘40% సర్కార్’అంటూ విమర్శలు చేసింది.ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంలోని మంత్రులు మరియు అధికారులు కాంట్రాక్టర్ల నుండి 40 శాతం ‘కమీషన్’ డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది.శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఏడుసార్లు గెలిచారు. 2018 ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్, జెడిఎస్ జతకట్టాయి, అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరడానికి విడిపోవడంతో వారి ప్రభుత్వం కూలిపోయింది.

Exit mobile version