Lok Sabha third Phase Polling: లోక్‌సభ మూడవ విడత పోలింగ్‌లో సంపన్నులు.. నేరస్తులు!

లోక్‌సభ ఎన్నికల మూడవ విడత పోలింగ్‌ మంగళవారం నాడు జరుగనుంది. అయితే ఈ విడతలో ఎంత మంది సంపన్నులు బరిలో ఉన్నారు. ఎంత మంది నేరస్తులు ఉన్నారో పరిశీలిద్దాం. మూడో విడతలో బీజేపీ మొత్తం 82 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది.

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 07:17 PM IST

Lok Sabha third Phase Polling: లోక్‌సభ ఎన్నికల మూడవ విడత పోలింగ్‌ మంగళవారం నాడు జరుగనుంది. అయితే ఈ విడతలో ఎంత మంది సంపన్నులు బరిలో ఉన్నారు. ఎంత మంది నేరస్తులు ఉన్నారో పరిశీలిద్దాం. మూడో విడతలో బీజేపీ మొత్తం 82 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. వారిలో 16 మంది ఆస్తులు సుమారు రూ. 50 కోట్లపై మాటే. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే 67 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. తొమ్మిది మంది అభ్యర్థుల ఆస్తి రూ.50 కోట్లపైనే ఉంది. ఇండియాలో ‘మనీ ఈజ్‌ పవర్‌ ” అనే సామెత ఎలాను ఉంది. మూడవ విడతలో డబ్బు ప్రాధాన్యం విపరీతంగా పెరిగిపోయింది. 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే మొత్తం 94 స్థానాల్లో మంగళవారం నాడు పోలింగ్‌ జరుగనుంది. వారిలో 29 శాతం అంటే 1,352 మంది కోటీశ్వర్లు ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బీజేపీ అభ్యర్థులు సంపన్నులు.. (Lok Sabha third Phase Polling)

అసోసిమేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రీఫామ్స్‌ సమాచారం ప్రకారం .. మూడవ విడత పోలింగ్‌లో సరాసరి ప్రతి అభ్యర్థి ఆస్తి రూ.5.66 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే బరిలో నిలిచిన వారిలో అత్యంత సంపన్నుల విషయానికి వస్తే బీజేపీకి చెందిన వారుగా నిలిచారు. వారి సరాసరి అభ్యర్థి ఆస్తి రూ.44.08 కోట్లు. కాగా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సరాసరి ఆస్తి రూ.42.93 కోట్లుగా తేలింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మూడవ స్థానంలో నిలిచారు. వారి సంపద రూ.20.6కోట్లుగా తేలింది. దక్షిణ గోవాకు చెందిన బీజేపీ అభ్యర్థి పల్లవి శ్రీనివాసరావు డెంపో అత్యంత సంపన్నుడుగా తేలారు. ఆయన సంపద రూ.1,361 కోట్లుగా తేలింది. మూడవ విడత పోలింగ్‌లో పోటీ చేసే సంపన్న అభ్యర్థుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది.

244 మందిపై  తీవ్రమైన క్రిమినల్‌ కేసులు

ఇక క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ విషయానికి వస్తే మూడవ విడతలో 1,352 మంది పోటీ చేస్తే వారిలో 5.7 మంది లేదా 37.5 శాతం మందికి క్రిమినల్‌ రికార్డులున్నట్లు ఎడిఆర్‌ వెల్లడించింది. 244 మందిపై అత్యంత తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. 2019లో 1,594 మంది పోటీ చేస్తే అప్పుడు 682 మంది లేదా 42.8 మందిపై క్రిమినల్‌ రికార్డులున్నాయి. ఇక బరిలో నిలిచిన క్రిమినల్స్‌ కాంగ్రెస్‌ నుంచి అత్యధికంగా 26 మంది పోటీ చేస్తే.. బీజేపీ నుంచి 22 మంది పోటీ చేస్తున్నారు. కాగా రెండు పార్టీలకు చెందిన వారిని పరిగణనలోకి తీసుకుంటే 14 మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. ఇక బీఎస్‌పీ విషయానికి వస్తే తొమ్మిది శాతం మంది క్రిమినల్స్‌ ఉన్నారు. 8 శాతం మందిపై సీరియస్‌ క్రిమినల్‌ చార్జీలున్నాయి..

ఇక జెండర్‌ గ్యాప్‌ విషయానికి వస్తే మూడవ విడత లోకసభ ఎన్నికల్లో 1,229 మంది పురుషులు బరిలో ఉంటే 123 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే 9.1 శాతం మంది మహిళలు ఉన్నట్లు లెక్క.ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన ఉద్దవ్‌ వర్గాన్ని తీసుకుంటే ఒక్క మహిళనుకూడా బరిలో నిలుపలేదు. ఇక సమాజ్‌వాది పార్టీ విషయానికి వస్తే పది స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక మహిళా అభ్యర్థిని నిలిపిపింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 13 మంది మహిళలను నిలిపింది.