Site icon Prime9

Hotel Bill: హోటల్‌బిల్లు రూ.6 లక్షలు.. బ్యాంకు ఖాతాలో రూ.41 మాత్రమే.. ఢిల్లీలో ఏపీ మహిళ ఘరానా మోసం

Hotel Bill

Hotel Bill

Hotel Bill: ఏపీకి చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని హోటల్‌లో బస చేసి బిల్లు కట్టే సమయంలో మోసం చేయటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్‌మాన్‌ హోటల్‌లో ఝాన్సీరాణి గత డిసెంబర్‌లో 15 రోజులు ఉండడానికి గదిని బుక్‌చేశారు. మొత్తం 5లక్షలకు పైగా సేవలను వినియోగించుకున్నారు.

యూపీఐ యాప్ ద్వారా చెల్లింపు..(Hotel Bill)

అనంతరం హోటల్‌ను విడిచివెళ్లే సమయంలో ఓ యూపీఐ యాప్‌ ద్వారా డబ్బులు పంపినట్లు సిబ్బందికి చూపించారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు విచారించి జనవరి 13న అరెస్టు చేశారు. ఆమె ఉపయోగించిన ఖాతా నకిలీదని తేలింది. మోసం కేసులో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. విచారణలో సదరు మహిళ బ్యాంకు ఖాతాలు ఇవ్వడంలో సహకరించలేదన్నారు. ఆమె పూర్తి వివరాల కోసం ఏపీ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. తాను, తన భర్త డాక్టర్లమని, న్యూయార్క్‌లో ఉంటామని విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. విమానాశ్రయం సమీపంలో మహిళ అన్నిరోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందో విచారణ చేస్తున్నామన్నారు.

హోటల్‌ లో రూ.6 లక్షలు మోసం..ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్ | Telugu Lady Arrested In Delhi | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar