Site icon Prime9

The Elephant Whisperers’ Belli: ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఫేమ్ బెల్లి ని కేర్‌టేకర్‌గా నియమించిన తమిళనాడు ప్రభుత్వం

The Elephant Whisperers

The Elephant Whisperers

The Elephant Whisperers’ Belli: ఆస్కార్ బహుమతి పొందిన డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో నటించిన బెల్లిని , తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి మహిళా కేర్‌టేకర్‌గా నియమించింది. బెల్లి నీలగిరి జిల్లాలోని తెప్పక్కడు ఏనుగుల శిబిరంలో మావటికి సహాయకురాలిగా నియమించబడింది. ప్రస్తుతం ఆమె ఏనుగుల తాత్కాలిక సంరక్షకురాలిగా ఉంది.రాష్ట్ర సచివాలయంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ఆమె భర్త బొమ్మన్ సమక్షంలో బెల్లికి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను అందించారు.

ఆసియాలోనే పురాతన ఏనుగు శిబిరం..(The Elephant Whisperers’ Belli)

అధికారిక ప్రకటన ప్రకారం, వదిలివేయబడిన ఏనుగుల పెంపకంలో బెల్లి యొక్క అంకితభావం మరియు ఆదర్శప్రాయమైన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ నియామకం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పక్కడు ఏనుగు శిబిరం మొత్తం ఆసియాలోని పురాతన ఏనుగు శిబిరాల్లో ఒకటి. శిబిరంలోని ప్రతి ఏనుగును గిరిజన సమాజానికి చెందిన ఒక మావటి మరియు ఒక సహాయకుడి ద్వారా పెంచుతారు.ఈ సంవత్సరం ప్రారంభంలో, నిర్మాత గునీత్ మోంగా యొక్క లఘు డాక్యుమెంటరీ, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ ‘డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్’ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది. తమిళనాడులోని ముదుమలై నేషనల్ పార్క్‌లో రూపొందించబడిన ఈ డాక్యుమెంటరీ, రఘు అనే అనాధ ఏనుగుపిల్ల మరియు స్వదేశీ దంపతులైన బొమ్మన్ , బెల్లితో బంధాన్ని చెబుతుంది.

తమిళనాడు ప్రభుత్వం, ముదుమలై టైగర్ రిజర్వ్ మరియు అనమలై టైగర్ రిజర్వ్‌లోని మొత్తం 91 మావటిలు మరియు సహాయకులకు ఇళ్ల నిర్మాణానికి రూ.9.10 కోట్లు మంజూరు చేసింది.కోయంబత్తూరులోని బోలంపాటి ఆర్‌ఎఫ్‌లో సాడివాయల్‌లో కొత్త ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.8 కోట్లు, పొల్లాచ్చిలోని అనమలై టైగర్ రిజర్వ్‌లోని కొజికముత్తి ఏనుగుల శిబిరాన్ని మెరుగుపరచడానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నీలగిరి పర్యటన సందర్భంగా తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని మెరుగుపరుస్తామని ప్రకటించారు.

Exit mobile version