Air India flight Returned:ఒక ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన కారణంగా ఢిల్లీ-లండన్ ఎయిరిండియా విమానం సోమవారం ప్రయాణించిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. ఎయిరిండియా విమానం ఉదయం 6.35 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరింది.
విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక ప్రయాణీకుడు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడని ఎయిర్ ఇండియా చెప్పింది.ఎయిరిండియా ఫ్లైట్ AI 111 ఏప్రిల్ 10, 2023న ఢిల్లీ-లండన్ హీత్రోకు నడపాల్సి ఉంది. విమానంలో ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన కారణంగా బయలుదేరిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. మౌఖిక మరియు వ్రాతపూర్వక హెచ్చరికలను పట్టించుకోకుండా, ప్రయాణీకుడు ఇద్దరు క్యాబిన్ సిబ్బందికి శారీరక హాని కలిగించాడు.పైలట్ ఇన్ కమాండ్ ఢిల్లీకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.ప్రయాణీకుడిని ల్యాండింగ్ చేయగానే భద్రతా సిబ్బందికి అప్పగించారు అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.ఎయిర్ ఇండియాలో మాకు విమానంలో ఉన్న అందరి భద్రత,మరియు గౌరవం ముఖ్యం. బాధిత సిబ్బందికి మేము అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నాము. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.ఈ మధ్యాహ్నం లండన్‌కు బయలుదేరడానికి విమానాన్ని రీషెడ్యూల్ చేసామని ప్రకటనలో తెలిపింది.
గత నెలలో, లండన్ నుండి ముంబై ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు విమానంలోని టాయిలెట్లో ధూమపానం చేస్తూ పట్టుబడ్డాడు . దీనితో అతనిపై కేసు నమోదు చేయబడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, నవంబర్ మూత్రవిసర్జన కేసులో నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించబడింది.