Site icon Prime9

Central Minister Aswini Vaishnav : సీనియర్ సిటిజన్ల రాయితీలు ఇప్పట్లో పునరుద్దరించలేం.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

Railway

Railway

Central Minister Aswini Vaishnav : రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించలేమని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రయాణీకుల సేవలకు గత ఏడాది రూ. 59,000 కోట్ల సబ్సిడీ ఇచ్చామని, పెన్షన్ మరియు జీతాల బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణంలో ఇచ్చే రాయితీలను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి సీనియర్ సిటిజన్లకు రాయితీ నిలిపివేయబడింది.రైల్వే వార్షిక పెన్షన్ బిల్లు రూ.60 వేల కోట్లు, జీతాల బిల్లు రూ. 97 వేల కోట్లు కాగా ఇంధనం కోసం రూ.40 వేల కోట్లు ఖర్చవుతున్నాయన్నారు.

మరో ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిస్తూ, ప్రస్తుతం వందేభారత్ రైళ్లు గరిష్టంగా 500 నుండి 550 కి.మీ దూరం వరకు సిట్టింగ్ కెపాసిటీతో నడుస్తున్నాయని, చెప్పారు. రామ మందిర నిర్మాణం పూర్తయితే దేశంలోని ప్రతి మూలకు రైళ్ల ద్వారా అయోధ్యను అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. 41 ప్రధాన రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన స్టేషన్లను దశలవారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

రైల్వేలు 2030 నాటికి పూర్తిగా కాలుష్య రహితంగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని, దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో భారతీయ ఇంజనీర్లు రూపొందించి, అభివృద్ధి చేసి, తయారు చేయాల్సిన హైడ్రోజన్ రైళ్ల అభివృద్ధి కూడా ఉందని ఆయన చెప్పారు.

Exit mobile version