Amritpal Singh: ఖలిస్తానీ నాయకుడు.. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు చేపట్టిన వేట ఐదో రోజుకు చేరుకుంది.
గురుద్వారాలో అమృత్ పాల్..
ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అయితే శనివారం అతడు ఓ గురుద్వారాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అతడు 45 నిమిషాల పాటు ఓ గురుద్వారాలో గడిపినట్లు తెలుస్తోంది. నంగల్ అంబియన్ గురుద్వారాకు చెందిన గ్రంథి ఆయన భార్య మీడియాకు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్ పాల్ శనివారం గురుద్వారాకు చేరుకున్నాడని తెలిపింది. సుమారు 45 నిమిషాల పాటు.. తమ వద్దే ఉన్నట్లు పోలీసులకు వెల్లడించింది. సాయంత్రం వరకు అతడి గురించి పోలీసులు వెతుకున్నట్లు తమకు తెలియదని వివరించింది.
తాము ఓ కార్యక్రమానికి వెళ్తున్నామని.. తమకు కొన్ని కొన్ని దుస్తులు కావాలని అడిగినట్లు తెలిపింది. దీంతో తమ కుమారుడి దుస్తులు అందించినట్లు తెలిపింది. వారు వెళ్లేముందు తమ దుస్తులను మార్చుకున్నారని పోలీసులు వెల్లడించారు.
అమృత్‌పాల్ కోసం పంజాబ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా వ్యూహంతో రంగంలోకి దిగినప్పటికి అతడి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు.
పోలీసులు గాలిస్తున్నారనే సమాచారం తెలియగానే.. తన కారుని వదిలి వేరే వాహనంలో అమృత్ పాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
హై కోర్టు ఆగ్రహం.. (Amritpal Singh)
అమృత్ పాల్ సింగ్ వ్యవహారంపై పంజాబ్ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై హై కోర్టు ఫైర్ అయింది. ప్రభుత్వం 80 వేల మంది పోలీసులను కలిగి ఉన్న కూడా.. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని తప్పుబట్టింది. పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హై కోర్టు కోరింది.
మిగతావారిని ఎలా అరెస్ట్ చేశారు..
అమృత్ పాల్ సింగ్ ని మినహా మిగతావారిని ఎలా అరెస్ట్ చేశారని హై కోర్టు ప్రశ్నించింది.
పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపులో భాగంగా 100 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు అతని అనేక వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అతని స్వగ్రామంలో భద్రతా సిబ్బందిని మోహరించారు.మరోవైపు రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.
దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులను మేము విడిచిపెట్టము. ఈ రాష్ట్ర ప్రజలు శాంతి మరియు పురోగతిని కోరుకుంటున్నారని మాన్ అన్నారు.
అమృత్ పాల్ సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా పంజాబ్‌లో చురుకుగా ఉన్నాడు. తరచూ సాయుధ మద్దతుదారులతో సంచరిస్తాడు.
అతను ఖలిస్తానీ వేర్పాటువాది మరియు టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే అనుచరుడిగా తనను పేర్కొన్నాడు. అతని మద్దతుదారులు అతడిని భింద్రన్‌వాలే 2.0 అని పిలుస్తారు.