Site icon Prime9

Sambhajinagar: మహారాష్ట్ర లోని శంభాజీనగర్‌ ఘాటీ ఆసుపత్రిలో ఇద్దరు నవజాత శిశువులతో సహా పదిమంది మృతి

Shambhajinagar

Shambhajinagar

Sambhajinagar: మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య పెరగుతుండగానే శంభాజీనగర్‌లోని ఘాటీ ఆసుపత్రిలో 24 గంటల్లో ఇద్దరు నవజాత శిశువులు సహా పది మంది రోగులు మరణించారు. దీనిపై శివసేన (UBT) నాయకుడు ఆదిత్య థాకరే X లో ఇలా వ్రాశారు. నాందేడ్ తరువాత ఇప్పుడు శంభాజీనగర్‌లోని ఆసుపత్రిలో 8 మంది రోగులు మరణించారు, ఇందులో 2 పిల్లలు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. మహారాష్ట్రలో తాము అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ కూడా X లో ఇలా వ్రాశారు. నాందేడ్‌లో మరణాల సంఖ్య కొనసాగుతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ప్రచారానికి కోట్లాదిరూపాయలు.. మందులకు లేవు..(Sambhajinagar)

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రుల మృతులకు సంతాపం తెలిపారు. ఇలాంటి సంఘటన ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాన్ని తెలియజేస్తోందని అన్నారు. రెండు నెలల క్రితం థానేలో జరిగిన ఇలాంటి సంఘటనను ఉటంకిస్తూ, పవార్ ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేసారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా మరియు అమాయక రోగుల ప్రాణాలు కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని గంటల్లో 24 మంది మరణించడంపై కాంగ్రెస్ సోమవారం బీజేపీ ప్రభుత్వాన్ని నిందించింది. బీజేపీ ప్రభుత్వం ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, పిల్లల మందులకు మాత్రం డబ్బులు ఖర్చు చేయడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోవైపు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు.

Exit mobile version