Assam Teachers Dress code: అస్సాం ప్రభుత్వం శనివారం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. వారు హుందాగా ఉండే రంగుల దుస్తులు ధరించి తరగతులకు హాజరు కావాలని, సాధారణ దుస్తులను ధరించరాదని కోరింది.
పాఠశాల నియమావళి ప్రకారం..(Assam Teachers Dress code)
కొంతమంది ఉపాధ్యాయులు కొన్నిసార్లు ప్రజలకు ఆమోదయోగ్యం కాని దుస్తులను ధరించడం అలవాటుగా చేసుకున్నారని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. జీన్స్ మరియు టీ-షర్టులను అనుమతించబోమని, మహిళా టీచర్లు సల్వార్‌లు ధరించాల్సి ఉంటుందని పేర్కొంది.అస్సాం విద్యా మంత్రి రోనుజ్ పెగు మాట్లాడుతూ పాఠశాల నియమావళి ప్రకారం ఉపాధ్యాయులు మర్యాదగా, సరిగ్గా దుస్తులు ధరించాలని ఉందని చెప్పారు.మహిళా ఉపాధ్యాయులు మర్యాదపూర్వకమైన సల్వార్ సూట్ / చీర / మేఖేలా-సదర్” ధరించాలి మరియు టీ-షర్ట్, జీన్స్ మరియు లెగ్గింగ్స్ వంటి సాధారణ దుస్తులు ధరించకూడదు” అని రోనుజ్ పెగు ట్వీట్ చేశారు.
టీచర్లలో భిన్నాభిప్రాయాలు..
దీనిపై ఒక ఉపాధ్యాయుడు మాట్లాడుతూ డ్రెస్ కోడ్‌ను కలిగి ఉండటం ముఖ్యమని, దానిని ఎల్లప్పుడూ పాటిస్తున్నానని చెప్పారు. మరికొందరు మహిళా టీచర్లు మాత్రం భిన్నంగా స్పందించారు. మహిళా ఉపాధ్యాయులు ఎవరూ జీన్స్ ధరించి పాఠశాలకు రారు. సల్వార్ లేదా మేఖేలా – సడోర్ బాగుంది కానీ లెగ్గింగ్స్ గురించి విచిత్రంగా ప్రస్తావించబడిందని ఒక ఉపాధ్యాయురాలు చెప్పింది
మనం మన డ్రెస్ కోడ్‌లను ఎందుకు ఎక్కువగా మార్చుకోవాలో లేదా ఒక నిర్దిష్ట రకమైన దుస్తులు ధరించిన స్త్రీ గురించి ప్రజలు ఆలోచించే విధానాన్ని ఎందుకు మార్చుకోవాలో నాకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. నోటిఫికేషన్‌పై కొందరు ఉపాధ్యాయులు మనస్తాపం చెందడం చాలా బాధాకరం. ఇది మన సంస్కారాలు బోధించాయి. ఇది భారతదేశం, ఇక్కడ గురువును దేవుడిగా పరిగణిస్తారు. నేను దీనిని స్వాగతిస్తున్నాను అంటూ మరో ఉపాధ్యాయుడు చెప్పారు.