Site icon Prime9

Tata Steel: ఏడాదిలో 22 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేయనున్న టాటా స్టీల్

Tata Steel

Tata Steel

Tata Steel: భారతీయ రైల్వేతో ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాదిలో 22 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేయనున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ రాబోయే రెండేళ్లలో 200 వందే భారత్ రైళ్ల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికోసం భారతీయ రైల్వే ఇటీవల టాటా స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది, దీని కింద కంపెనీ దేశంలోనే అత్యంత వేగవంతమైన మ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క రైళ్లను తయారు చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ 2024 మొదటి త్రైమాసికం నాటికి వందే భారత్ మొదటి స్లీపర్ వెర్షన్‌ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

టాటా స్టీల్ కు  రూ.145 కోట్ల టెండర్..(Tata Steel)

ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అనేక పథకాలపై భారతీయ రైల్వే మరియు టాటా స్టీల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పథకం కింద, ప్రస్తుతం, భారతీయ రైల్వేలు రైలు భాగాల తయారీ కోసం టాటా స్టీల్ కు సుమారుగా రూ.145 కోట్ల రూపాయల టెండర్‌ను ఇచ్చాయి, ఇది 12 నెలల్లో పూర్తవుతుందని సమాచారం. దీనిపై టాటా స్టీల్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ అండ్ న్యూ మెటీరియల్స్ బిజినెస్) దేబాశిష్ భట్టాచార్య మాట్లాడుతూ ఈ రైలు సీట్లు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇవి 180-డిగ్రీల వరకు తిప్పగలవు మరియు విమానంలో మాదిరి ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉంటాయి, ఇవి భారతదేశంలోనే మొట్టమొదటివని అన్నారు.

టాటా స్టీల్ యొక్క మిశ్రమ విభాగం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సిస్టమ్ కోసం బల్క్ ఆర్డర్‌ను స్వీకరించిన తర్వాత ఈ దిశలో పని చేయడం ప్రారంభించింది, ఇందులో ఒక్కొక్కటి 16 కోచ్‌లతో కూడిన 22 రైలు సెట్లు ఉన్నాయి. టాటా స్టీల్ రైల్వేలో తన వాటాను పెంచుకోవడంలో నిరంతరం నిమగ్నమై ఉంది. రైల్వేలతో సమన్వయం కోసం అధికారులను కూడా నియమించింది.

వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 కొత్త వందేభారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ప్రతినెలా ఏడెనిమిది రైళ్లు సిద్ధంగా ఉండాలన్నది రైల్వే లక్ష్యం కావడంతో ఈ రైళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. అయితే వేగం చూస్తుంటే రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.రైల్వే వర్గాల సమాచారం మేరకు ప్రతి కొత్త వందే భారత్ రైలులో కొన్ని కొత్త సాంకేతికత మరియు అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దీని కారణంగా క్రమంగా ఖర్చు కూడా పెరుగుతోంది. 16 కోచ్‌ల వందే భారత్ రైలు నిర్మాణ వ్యయం దాదాపు రూ. 110-రూ. 120 కోట్లకు చేరుకోగా, దీనిని 106 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. ఐసిఎఫ్ ప్రతి నెలా దాదాపు 10 రైళ్లను తయారు చేయాలని యోచిస్తోంది.

కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరియు రాయ్ బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో 400 వందే భారత్ రైళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి కోచ్‌ల తయారీని ప్రారంభించనున్నాయి. మేక్ ఇన్ ఇండియా తరహాలో వందేభారత్‌ను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టినా వందేభారత్‌కు ఇంకా ఆశించిన మేర పనిజరగలేదు. పలుమార్లు టెండర్ల ప్రక్రియ నిలిచిపోయిందని చెబుతున్నారు.

Exit mobile version