Site icon Prime9

Tamilnadu: రాత్రికి రాత్రే నిర్ణయం.. మంత్రి బర్తరఫ్ విషయంలో వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్

tamilnadu governer

tamilnadu governer

Tamilnadu: ‘క్యాష్ ఫర్ జాబ్స్’, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుపాలైన మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. రాత్రిరాత్రి ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచనల మేరకు తన ఆదేశాలను వెనక్కు తీసుకున్నారు. మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను హోల్డ్‌లో పెట్టినట్టు చెబుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు లేఖ రాశారు. మంత్రి బర్తరఫ్ విషయంలో గవర్నర్ పోకడ సరైనది కాదని.. తొలుత అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్న తర్వాతే గవర్నర్ ఇలాంటి నిర్ణయం ఆర్ఎన్ రవి తీసుకోవాలన్న కేంద్రం సలహాతోనే ఈ విషయంపై వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు తొలుత జారీ చేసిన ఆదేశాలు హోల్డ్‌లో ఉంటాయని పేర్కొన్నారు.

శాఖలేని మంత్రిగా(Tamilnadu)

ఈ నెల 14న మంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఎటువంటి శాఖలేని మంత్రిగా కొనసాగిస్తూ వస్తోంది. అప్పటి వరకు ఆయన చూసుకున్న విద్యుత్, ఎక్సైజ్ శాఖలను ఆర్థికమంత్రి తంగం తెన్నరసు, హౌసింగ్ మంత్రి ముత్తుస్వామికి ప్రభుత్వం అప్పగించింది.

కాగా మంత్రి సెంథిల్ బాలాజీని తొలగించే హక్కు గవర్నర్ కు లేదని, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని గురువారం సీఎం స్టాలిన్ చెప్పారు. రాష్ట్ర మంత్రి మండలి నుంచి బాలాజీని తొలగించే ఉత్తర్వు, అది రూపొందించిన కాగితానికి కూడా విలువ లేదని డిఎంకె నాయకుడు ఎ.శరవణన్ అన్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ కూడా జైలులో ఉన్న మంత్రిని తొలగించడాన్ని నిందించారు. సీఎం సలహా మేరకే మంత్రులను నియమిస్తారు కాబట్టి సీఎం సలహా మేరకే వారిని తొలగించవచ్చునని మనీష్ తివారీ పేర్కొన్నారు. కాగా గత కొంతకాలంగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ప్రభుత్వానికి గవర్నరు మధ్య విభేదాలు వస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version