Site icon Prime9

Viral news: పెళ్లికి ముందు షరతుకు ఒప్పుకుంటూ సంతకం చేసిన వధువు

tn-wedding-contract

Tamil Nadu: ఈ రోజుల్లో, చాలా మంది జంటలు కాంట్రాక్టు మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తమ పెళ్లికి ముందు ఒప్పందం పై సంతకాలు చేస్తున్నారు. వ్యక్తులను బట్టి, వారి అవసరాలను బట్టి ఇవి ఉంటాయి. అయితే తమిళనాడులో మాత్రం కాబోయే భార్యభర్తలు ఇద్దరు చేసుకున్న ఒప్పదం ఆసక్తిని రేపింది.

తమిళనాడులోని తేనిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హరిప్రసాద్‌కు ఆదివారం పూజతో వివాహం జరిగింది. పెళ్లిలో హరిప్రసాద్ స్నేహితులు రూ.20 స్టాంప్ పేపర్ తీసుకొచ్చి పెళ్లి చేసుకునే ముందు ఒప్పందం కుదుర్చుకోవాలని పూజను కోరారు. ఆశ్చర్యపోయిన పూజ స్టాంప్ పేపర్‌లోని విషయాన్ని చదువుతూ నవ్వును ఆపుకోలేకపోయింది. సూపర్‌స్టార్ క్రికెట్ జట్టు కోసం శని మరియు ఆదివారాల్లో నేను, పూజ, హరిప్రసాద్‌ని క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తున్నాను” అని అందులో రాశారు. దీనిపై ఆమె నవ్వుతూ సంతకం చేసింది.

హరిప్రసాద్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సూపర్ స్టార్ క్రికెట్ జట్టుకు కెప్టెన్. పెళ్లి తర్వాత క్రికెట్ ఆడేందుకు హరిప్రసాద్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు, అతని స్నేహితులు ఈ ఆలోచనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానికి పూజ కూడా అంగీకరించింది. ఈ జంట సంతకం చేసిన ఒప్పందాన్ని వారి స్నేహితులతో ఫోటోలు తీశారు. ఈ విధంగా వారి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

Exit mobile version