Site icon Prime9

Tamil Nadu: తమిళనాడులోని రెండు బాణసంచా కర్మాగారాల్లో పేలుళ్లు .. 13 మంది మృతి

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని బాణాసంచా కర్మాగారాల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. వీరందరూ ఫ్యాక్టరీల్లో  పనిచేసే కార్మికులుగా పోలీసులు భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని రంగంలోకి దించారు.

మృతుల కుటుంబాలకు పరిహారం..(Tamil Nadu)

మొదట శివకాశి సమీపంలోని రంగపాళ్యం బాణసంచా తయారీ కేంద్రంలో ప్రారంభ పేలుడు సంభవించింది, అగ్నిమాపక బృందాలు తక్షణమే స్పందించాయి.అనంతరం కమ్మపట్టి గ్రామంలో ఉన్న బాణసంచా కర్మాగారంలో ఈసారి రెండవ పేలుడు సంభవించింది. పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది, ప్రజలు సంయుక్తంగా మంటలను ఆర్పి బాధితులను రక్షించేందుకు ప్రయత్నించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ దుర్ఘటనల పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించారు.గత వారం, తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో జరిగిన బాణాసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా  పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

Exit mobile version