Site icon Prime9

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత

Jammu and Kashmir

Jammu and Kashmir

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ మరియు రాజౌరీ జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.గురువారం మధ్యాహ్నం పూంచ్‌లోని సురన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గాలీ మరియు బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఆర్మీ వాహనాలపై సాయుధ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఆర్మీ భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే వదంతులు వ్యాప్తిచెందకుండా,శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు.

సరిహద్దు వద్ద చొరబాటు యత్నం..(Jammu and Kashmir)

జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్‌లోని ఖౌర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నం విఫలమైందని ఇండియన్ ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది.డిసెంబరు 22 మరియు డిసెంబర్ 23 మధ్య రాత్రి నిఘా పరికరాల ద్వారా నలుగురు ఉగ్రవాదుల కదలికలను అనుమానిస్తున్నట్లు సైన్యం గుర్తించింది.తెల్లవారుజామున అఖ్నూర్‌లోని ఖౌర్ సెక్టార్‌లోని ఐబి మీదుగా నలుగురు భారీ ఆయుధాలు కలిగిన ఉగ్రవాదుల బృందం ఇటువైపు నుంచి చొరబడేందుకు ప్రయత్నించడం గమనించామన్నారు. ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరిపారని, వారిలో ఒకరుకిందపడిపోయారని వారు చెప్పారు. అయితే అతని మృతదేహాన్ని అతని సహచరులు తీసుకుని సరిహద్దు నుంచి వెనక్కి మళ్లారని అన్నారు.

Exit mobile version