Delhi: ఢిల్లీవాసులకు ఈ ఏడాది కూడా దీపావళి పండుగ నాడు టపాకాయలు కాల్చేందుకు వీలు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల నిషేదాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి కల్పించేందుకు వీలు కల్పిద్దాం అంటూ బాణ సంచా నిషేదాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ నుద్ధేశించి ధర్మాసనం పేర్కొనింది.
కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా టపాకాయల తయారీ, విక్రయాలు, వాడకాన్ని పూర్తిగా నిషేదించింది. ఈ క్రమంలో భాజపా ఎంపీ మనోజ్ తివారీ నిషేదాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు బాణసంచా కేసును తక్షణమే విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొనింది. టపాసులు కోసం ఖర్చు చేసే డబ్బుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.
ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ తోపాటు పలు వాజ్యాలు దీపావళి పండుగ సమయంలో టపాసులు కాల్చుకొనేందుకు దాఖలు చేసివున్నారు. అయితే న్యాయస్ధానం మాత్రం ఢిల్లీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని కరెక్ట్ గానే పేర్కొనింది. 2023 జనవరి వరకు ఆప్ ప్రభుత్వ నిషేదం ప్రకటించింది. అయితే నిషేదం ఏకపక్షమని, చట్ట విరుద్దమని, కొందరి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్ ఢిల్లీ కోర్టులో ఆరోపించారు. అయితే సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తాము విచారించలేమని పేర్కొనింది. దీంతో ఆశావహుల్లో నిరాశ నెలకొనింది.
మరో వైపు ఢిల్లీ సర్కారు టపాసుల నిషేదాన్ని కఠినంగా అమలు పరిచేందుకు చర్యలు చేపట్టింది. తయారు చేసినా, నిల్వ చేసినా, కాల్చినా జరిమానాలతోపాటు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. అయితే చట్టం ఆప్ నేతలకు చుట్టంగా మారిందని భాజపా నేత తజీందర్ పాల్ సింఘ్ ఆరోపించారు. ఓ పార్టీ కార్యక్రమంలో ఆప్ శ్రేణులు బాణసంచా కాలుస్తున్న ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేసిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Massive Explosion: టపాసుల గోదాములో పేలుడు, నలుగురు మృతి.. ఎక్కడంటే?