Site icon Prime9

Hemant Soren: జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Hemant Soren

Hemant Soren

Hemant Soren: జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బెయిల్‌ ఇవ్వాలని ఆయన పిటిషన్‌ పెట్టుకున్నారు. అయితే ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థాన తిరస్కరించింది. ట్రయల్‌కోర్టులో వాస్తవాలు ఇవ్వనందుకు ఆయన బెయిల్‌ ఇవ్వలేదని.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదులను ట్రయల్‌ కోర్టు పరిగణనలోకి తీసుకుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. తాజాగా సుప్రీంకోర్టు ప్రకటనతో సోరెన్‌ లాయర్లు సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాగా హేమంత్‌ సోరెన్‌ను ఈడీ జనవరి 31న మనీలాండరింగ్‌ కేసుతో పాటు ల్యాండ్‌ స్కామ్‌ కేసులో అరెస్టు చేసింది.

బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ..(Hemant Soren)

ఇదిలా ఉండగా జార్ఖండ్‌ మాజీ సీఎం సోరెన్‌ లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి తనకు బెయిల్‌ ఇవ్వాలని సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా సోరెన్‌కు బెయిల్‌ ఇవ్వరాదని ఈడీ తరపు నాయ్యవాదులు కోర్టులో గట్టిగా వాదించారు. ఆయనకు ఎలాంటి ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఇవ్వరాదని కోరింది. సోరెన్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ.. ఒక వేళ సోరెన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుందని, మాజీ సీఎం కాబట్టి సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన వెనుక ఉంటుందని బెయిల్‌ పిటిషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇక ఈ కేసు పూర్వా పరాల విషయానికి వస్తే.. భాను ప్రతాప్‌ ప్రసాద్‌ అనే ల్యాండ్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను 2023లో అరెస్టు చేశారు. అయితే భాను ప్రతాప్‌ కూడా భూ కబ్జా సిండికేట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్‌ ల్యాండ్‌ రికార్డులు మార్చడంలో సిద్దహస్తుడు. కాగా ఆయన నుంచి పలు ఒరిజినల్‌ ల్యాండ్‌ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఫోన్‌లో 8.36 ఎకరరాల ల్యాండ్‌ ఉన్న ఇమేజ్‌ ఉంది. అయితే ఈ భూమి సోరెన్‌ చేతిలో ఉన్నట్లు సో రెన్‌పై ఆరోపణలు నమోదు అయ్యాయి.

Exit mobile version